Hyderabad Rains: హైదరాబాద్‌కు వర్ష సూచన.. వాతావరణ శాఖ అలర్ట్

హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ నెల 21 వరకు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బండ్లగూడ, శేరిలింగం పల్లి, రామచంద్రాపురం ప్రాంతాల్లో గురువారం 15.6 మి.మీ. నుంచి 64.4 మి.మీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Hyderabad Rains: హైదరాబాద్‌కు వర్ష సూచన.. వాతావరణ శాఖ అలర్ట్

Updated On : March 15, 2023 / 7:53 PM IST

Hyderabad Rains: హైదరాబాద్ నగర వాసులకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ నెల 21 వరకు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

CM Jagan: వచ్చే జనవరి నుంచి రూ.3 వేల పెన్షన్.. నాలుగేళ్ల పాలనలో గ్రామాల రూపురేఖలు మారాయి: సీఎం జగన్

బండ్లగూడ, శేరిలింగం పల్లి, రామచంద్రాపురం ప్రాంతాల్లో గురువారం 15.6 మి.మీ. నుంచి 64.4 మి.మీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇతర ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో కురిసే వర్షం, గతంలో మార్చిలో కురిసిన వర్షం రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని వాతావరణ శాఖ అచనా వేస్తోంది. ఆదివారం అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి లేదా వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తమ పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంతోపాటు, తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు, వేడి గాలులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే ఎండ వేడిమి నుంచి ప్రజలకు కాస్త ఊరటగా ఉంటుంది.