Kishan Reddy : డీజీపీకి కిషన్ రెడ్డి ఫోన్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీకి ఫోన్ చేశారు. పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కిషన్ రెడ్డి డీజీపీ దృష్టికి దృష్టికి తెచ్చారు

Kishan Reddy : డీజీపీకి కిషన్ రెడ్డి ఫోన్

Kishan Reddy

Updated On : January 4, 2022 / 8:11 PM IST

Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీకి ఫోన్ చేశారు. పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కిషన్ రెడ్డి డీజీపీ దృష్టికి తెచ్చారు. బండి సంజయ్ కార్యాలయాన్ని పోలీసులు ఇనుపరాడ్లతో పగులగొట్టడం, ఆయనను అరెస్ట్ చేయడం, బుధవారం నడ్డాను ఎయిర్ పోర్టులో అడ్డుకోడం వంటి విషయాలను కిషన్ రెడ్డి డీజీపీతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా పోలీసులు వ్యవహరించాలని ఈ సందర్భంగా డీజీపీని కిషన్ రెడ్డి కోరినట్లు సమాచారం. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా పోలీసు చర్యలు ఉన్నాయని డీజీపీకి చెప్పినట్లుగా తెలుస్తోంది.

చదవండి : KishanReddy meets Sai Tej:నటుడు సాయిధరమ్ తేజ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి

ఇక ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన నడ్డా.. అటునుంచి నేరుగా సికింద్రాబాద్ వెళ్లారు. ప్యారడైజ్ నుంచి కొద్దీ మంది బీజేపీ కార్యకర్తలతో ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఇక ఈ రోజు రాత్రికి నడ్డా అన్నోజిగూడలోని ఆర్ఎస్ఎస్ శిభిరంలో బసచేయనున్నారు. ఇక రేపటి నుంచి మూడు రోజులపాటు ఆర్ఎస్ఎస్ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తోపాటు సంఘ్ అనుబంధ సంస్థల కీలను నేతలు హాజరు కానున్నారు.

చదవండి : J.P Nadda : హైదరాబాద్‌కు నడ్డా రాక.. పోలీసుల ఆంక్షలతో ఉద్రిక్తత