Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో వైరల్

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలని వెంకట్ రెడ్డి కోరుతున్నట్లు ఆ ఆడియోలో వినపడుతోంది. పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డికి సాయం చేయాలని ఆయన అన్నట్లు తెలుస్తోంది. నియోజక వర్గంలో చాలా మందిని రాజగోపాల్ రెడ్డి ఆదుకున్నారని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తానని, కాబోయే టీపీసీసీ చీఫ్ తానేనని చెప్పారు. టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత తాను రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని అన్నారు.

Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో వైరల్

Congress MP Komatireddy Venkata Reddy hunger strike

Updated On : October 21, 2022 / 2:38 PM IST

Munugode bypoll: తెలంగాణలోని మునుగోడులో ఉప ఎన్నిక వేడి రాజుకున్న వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఓ కాంగ్రెస్ కార్యకర్తతో వెంకట్ రెడ్డి ఫోనులో మాట్లాడుతున్నట్లు అది ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలని వెంకట్ రెడ్డి కోరుతున్నట్లు ఆ ఆడియోలో వినపడుతోంది.

పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డికి సాయం చేయాలని ఆయన అన్నట్లు తెలుస్తోంది. నియోజక వర్గంలో చాలా మందిని రాజగోపాల్ రెడ్డి ఆదుకున్నారని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తానని, కాబోయే టీపీసీసీ చీఫ్ తానేనని చెప్పారు. టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత తాను రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని అన్నారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ లో స్టార్ క్యాంపెనర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. పది రోజుల హాలిడే ట్రిప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లడం గమనార్హం. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియోపై స్పందించడానికి అందుబాటులో లేరు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..