COVID 19 in Telangana : 24 గంటల్లో 661 కేసులు, కోలుకున్నది 1,637

  • Published By: madhu ,Published On : November 15, 2020 / 11:28 AM IST
COVID 19 in Telangana : 24 గంటల్లో 661 కేసులు, కోలుకున్నది 1,637

Updated On : November 15, 2020 / 12:29 PM IST

COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సంఖ్య వందల్లోకి చేరుకొంటోంది. గత 24 గంటల్లో 661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 1, 637 మంది కోలుకున్నారని, ముగ్గురు చనిపోయారని హెల్త్ బులెటిన్ లో ప్రభుత్వం వెల్లడించింది.



మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2, 57, 374 ఉండగా, 2, 40, 545 మంది కోలుకున్నారని తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 15, 425 ఉండగా, గృహ/ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 12,888గా ఉందని వెల్లడించింది.



ఇక జిల్లాల వారీగా కేసులు చూస్తే…
ఆదిలాబాద్ 10. భద్రాద్రి కొత్తగూడెం 29. జీహెచ్ఎంసీ 167. జగిత్యాల 15. జనగామ 04. జయశంకర్ భూపాలపల్లి 10. జోగులాంబ గద్వాల 8. కామారెడ్డి 03. కరీంనగర్ 24. ఖమ్మం 19. కొమరం భీం ఆసిఫాబాద్ 02. మహబూబ్ నగర్ 11.



మహబూబాబాద్ 22. మంచిర్యాల 17. మెదక్ 07. మేడ్చల్ మల్కాజ్ గిరి 45. ములుగు 12. నాగర్ కర్నూలు 22. నల్గొండ 34. నారాయణపేట 0. నిర్మల్ 04. నిజామాబాద్ 15. పెద్దపల్లి 06. రాజన్న సిరిసిల్ల 2. రంగారెడ్డి 57. సంగారెడ్డి 28. సిద్దిపేట 23. సూర్యాపేట 14. వికారాబాద్ 07. వనపర్తి 09. వరంగల్ రూరల్ 12. వరంగల్ అర్బన్ 21. యాదాద్రి భువనగిరి 02. మొత్తం : 661.