తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వీరిని ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తరువాత అసదుద్దీన్ ఒవైసీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి ఆహ్వానించడానికి వెళ్తామని చెప్పారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వీరిని ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar

Updated On : December 7, 2024 / 2:40 PM IST

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. దీనిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 9వ తేదీ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌ శర్మను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి రావాల్సిందిగా ఆహ్వానించామని తెలిపారు.

వారు ఈ కార్యక్రమానికి వచ్చి తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ పోరాటానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఇక్కడి నుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడానికి వెళ్తున్నామని, కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తామని తెలిపారు.

తరువాత అసదుద్దీన్ ఒవైసీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి ఆహ్వానించడానికి వెళ్తామని చెప్పారు. కాగా, హైదరాబాద్‌లోని రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈనెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గవర్నర్ ను ఆహ్వానించారు.

Shadnagar MLA: షాద్‌న‌గ‌ర్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీపీసీసీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ