Rythu Bharosa: ‘రైతు భరోసా’పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్.. ప్రతి గ్రామంలోనూ..
తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.12వేల చొప్పున రెండు విడుతల్లో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.

Rythu Bharosa
Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.12వేల చొప్పున రెండు విడుతల్లో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు విడుతల్లో మూడెకరాలు కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.3వేల కోట్ల సొమ్మును రేవంత్ సర్కార్ జమ చేసింది. అయితే, మూడెకరాల భూమి కలిగి, రైతు భరోసాకు అర్హత కలిగిన కొందరు రైతుల ఖతాల్లో ఇంకా డబ్బులు జమ కాలేదు. దీంతో సదరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: Ration Cards: కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఎప్పుడు? నేటి నుంచి ఆ జిల్లాలో..
క్షేత్ర స్థాయిలో సర్వే చేసిన అధికారులు సాగుయోగ్యం కాని భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ క్రమంలో సాగుయోగ్యమైన భూములుసైతం బ్లాక్ లిస్టులోకి వెళ్లినట్లు తెలిసింది. ఈ కారణంగా అర్హత ఉన్నా కొందరి రైతులకు రైతు భరోసా డబ్బులు జమ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, త్వరలో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు రైతు భరోసా పథకంలో భాగంగా మూడు ఎకరాల వరకు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
Also Read: March New Rules : బిగ్ అలర్ట్.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. ఏయే మార్పులు జరిగాయో తెలుసుకోండి..
శుక్రవారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శితో డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మూడెకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని, అయితే, టెక్నికల్ సమస్య కారణంగా నిధులు జమ కాని రైతుల వివరాలను సరిచేసి వెంటనే వారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా.. రైతు భరోసా పథకం కింద లబ్ధిపొందిన రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీలతో ప్రచారం చేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా, గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని సూచించారు.