Computers Theft in Police Academy : హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ .. ఏడు కంప్యూటర్లు మాయం
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. అకాడమీలో ఏడు కంప్యూటర్లు మాయమయ్యాయి. ఏకంగా పోలీస్ అకాడమీలోనే చోరీ జరగటం తీవ్ర కలకలం రేపింది.

Computers theft in hyderabad police academy
Computers theft in hyderabad police academy : హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. అకాడమీలో ఏడు కంప్యూటర్లు మాయమయ్యాయి. ఏకంగా పోలీస్ అకాడమీలోనే చోరీ జరగటం తీవ్ర కలకలం రేపింది. ఐపీఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లోని ఏడు కంప్యూటర్లు మాయం కావటంపై అధికారులు విచారణ చేపట్టారు. సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలను బట్టి ఈ చోరీ చేసింది అకాడమీ ఐటీ సెక్షన్ ఉద్యోగి చంద్రశేఖరే కంప్యూటర్లను దొంగతనం చేసినట్లుగా అధికారులు నిర్ధారించారు.
ఈచోరీపై ఇంటి దొంగ చంద్రశేఖర్ పై రాజేంద్రనగర్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.అయితే కంప్యూటర్ లో ఉన్న డేటా కోసం చోరీకి పాల్పడ్డారా.? లేదా ఇంకేమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పటిష్టమైన సెక్యూరిటీ ఉండే నేషనల్ అకాడమీలోంచి ఇంత ధైర్యంగా పైగా సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని తెలిసి కడా ఏడు కంప్యూటర్లు మాయం చేసిన చంద్రశేఖర్ ఈ చోరీ వెనుక ఉన్న అసలు ఉద్ధేశం ఏంటీ అనేది చర్చనీయాంశంగా మారింది.