Road Accident : శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు కార్మికులు మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఢీకొన్న లారీ బోల్తా పడింది.

Road Accident : శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు కార్మికులు మృతి

Updated On : April 18, 2021 / 9:42 PM IST

Six workers killed in road accident : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఢీకొన్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురు లారీ కింద ఇరుకున్నారు.

ప్రమాద సమయంలో మొత్తం 30 మందికిపైగా కార్మికులు లారీలో ఉన్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఇటుకబట్టీలో పనిచేసే కార్మికులుగా పోలీసులు గుర్తించారు.

కూరగాయలు, నిత్యవసర సరుకులు కొనేందుకు వచ్చి వెళ్లుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ మద్యం తాగి నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.