Southwest monsoon: చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం

నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. రాబోయే ఐదురోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Southwest monsoon: చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం

Rain

Updated On : June 20, 2022 / 7:06 AM IST

Southwest monsoon: నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. రాబోయే ఐదురోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రానున్న ఐదు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తితో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్షం.. తడిసి ముద్దయిన నగరం

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా వరకు నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. ఇప్పటికే అస్సోలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు.