తెలంగాణలో లాక్ డౌన్ కంటిన్యూ : పరీక్షలు లేకుండానే పై తరగతులకు – కేసీఆర్

  • Published By: madhu ,Published On : April 11, 2020 / 04:07 PM IST
తెలంగాణలో లాక్ డౌన్ కంటిన్యూ : పరీక్షలు లేకుండానే పై తరగతులకు – కేసీఆర్

Updated On : April 11, 2020 / 4:07 PM IST

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెరదించారు సీఎం కేసీఆర్. భారతదేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దీంతో కేంద్రం లాక్ డౌన్ విధించింది. ఈ దశలో పరీక్షల సీజన్ నడుస్తోంది. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని రోజులుగా స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పాఠశాలలు, కాలేజీలు, ఇతర ఇనిస్టిట్యూట్స్ మూసివేయాలని ఆదేశించారు.

దీంతో కొన్ని రోజులుగా స్కూల్స్ తెరచుకోలేదు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి పరీక్షలు తెలంగాణాలో జరగలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనలో పడిపోయారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం దానిపై ఎక్కువగా దృష్టి సారించింది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఈ వైరస్ సోకి..ఇతరులకు వ్యాపించింది. దీంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కఠినంగా నిబంధనలు విధించింది. 

2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం ఉదయం ప్రధాన మంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని లాక్ డౌన్ పొడిగింపుపై అభిప్రాయాలు తెలియచేశారు. అనంతరం సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరిగింది. 5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలపై చర్చించడం జరిగిందని వివరించారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు పరీక్షలు పాస్ లేకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాలు ఈ విధంగానే నిర్ణయం తీసుకున్నాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 10వ తరగతి పరీక్షల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్.