‘ధరణి’ : అరగంటలో రైతుల చేతికి పాస్ పుస్తకం

Telangana : dharani portal : తెలంగాణ రాష్ట్రంలో భూ లావాదేవీలకు ఆధారంగా మారనున్న ధరణి పోర్టల్ ను CM KCR దసరా రోజు ప్రారంభించనున్నారు. విజయదశమి అంటే విజయానికి చిహ్నం. శుభదినం. ప్రజలంతా విజయదశమి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో దసరా రోజు ‘ధరణి’ పోర్టర్ ను ప్రారంభించనున్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ‘ధరణి’ పోర్టల్ కు సంబంధించి అన్ని పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
భూ రికార్డులకు సంబంధించి ధరణి వెబ్‌సైట్‌లో ఏ డేటా ఉంటే ఆ వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని, ఇతర రికార్డులను పరిశీలించడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దసరా నుంచి అంటే..అక్టోబర్ 25,2020 నుంచి ధరణి పోర్టల్ అందుబాటులోకి రానుంది. ‘ధరణి’పోర్టల్ అందుబాటులోకి రానున్న క్రమంలో అన్ని వివరాలు సవ్యంగా ఉంటే రైతుల చేతికి కేవలం అరగంటలోపే పాస్ పుస్తకం చేతికి అందనుంది. ఆయా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి పట్టాదారు పాస్‌పుస్తకం రైతు చేతికందనుంది.
భూ రికార్డులకు సంబంధించి ధరణి వెబ్‌సైట్‌లో ఏ డేటా ఉంటే ఆ వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని, ఇతర రికార్డులను పరిశీలించడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దసరా నుంచి అంటే, ఈనెల 25వ తేదీన ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఆ రోజు నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో జరుగుతుతాయి. అయితే తొలిదశలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లను మాత్రమే చేయడానికి తహసీల్దార్లకు అవకాశం ఇచ్చారు.
ఆ మేరకు భూముల విక్రయాలకు సంబంధించిన సేల్ డీడ్, కుటుంబసభ్యులు/ఇతర భూముల యాజమానులు పంచుకునే పార్టిషన్, కటుంబసభ్యులు సమర్పించే సక్సెషన్ (వారసత్వ) డీడ్, గిఫ్ట్ డీడ్‌లు చేయడానికే తహసీల్దార్లకు అవకాశం ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.రిజిస్ట్రేషన్ సహా రెవెన్యూ రికార్డుల అప్‌డేషన్, మ్యుటేషన్ (హక్కు బదలాయింపు) అంతా అప్పుడే అక్కడికక్కడే పూర్తి కానున్నాయి. . ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం–2020తో భూ హక్కుదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి సంబందించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పటికే కూలంకషంగా పూర్తికావటంతో విజయదశమి నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.
ఈ రిజిస్ట్రేషన్‌కు అప్లికేషన్ పూర్తి చేయటం నుంచి స్లాట్ బుకింగ్ వరకుపలు దశల్లో సమాచారాన్ని క్రయ, విక్రయదారులు ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. పారదర్శకంగా, సులభతరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగేలా చూడటం..దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసేలా రెవెన్యూశాఖ ధరణి పోర్టల్‌ను రూపొందించింది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు స్లాట్ బుక్ చేసుకొని రిజి్రస్టేషన్ కోసం తహసీల్‌కు వెళ్లేలా ప్లాట్‌ఫామ్‌ను తయారుచేసింది. ఆన్‌లైన్ పరిజ్ఞానంలేని రైతులు మాత్రం ఈ–సేవ కేంద్రాల్లో చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు పాన్‌కార్డు నంబర్‌ను నమోదు చేయాలి. పాన్ కార్డు లేకపోతే ఫారం 60, 61 డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
అక్టోబరు 25 నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్లు తహసీళ్లలో..వారసత్వ బదిలీ, క్రయవిక్రయాలు, భాగపంపిణీ, బహుమతి, కోర్టు డిక్రీ ద్వారా వచ్చే హక్కులకు సంబంధించి తహశీల్దారులే చేయనున్నారు. కాగా..సాగు భూములు లేని హైదరాబాద్ జిల్లాను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దసరా రోజున ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధమైంది.ఆయా భూముల్ని అమ్మినవారు..కొన్నవారు కూడా రిజిస్ట్రేషన్ సమయంలో అఫిడవిట్ సమర్పించాలి. దీంట్లో పరస్పర అంగీకారం మేరకే ఈ లావాదేవీలు జరిగినట్లు ఇద్దరు తమ వారి అంగీకారాన్ని తెలియజేయాల్సివుంటుంది.
భూ క్రయ..విక్రయదారులు ఏం చేయాలంటే..
- ముందుగా ధరణి పోర్టల్‌లోకి వెళ్లి స్లాట్‌బుక్ చేసుకోవాలి.
- తరువాత రైతుల మొబైల్ నంబర్‌కు ఓ OTP వస్తుంది. ఆ నంబర్ ను నమోదు చేయాలి.
- రిజస్ట్రేషన్ కు సంబంధించి అప్లికేషన్ పూర్తి చేయాలి.
- రైతు పాస్‌బుక్‌కు సంబంధించిన సమాచారం..సర్వే నంబర్ల వివరాలు..ఆ భూమికి సబందించి మార్కెట్ వ్యాల్యూ..భూమి సరిహద్దుల్ని ధరణి పోర్టల్‌లోనే అప్లికేషన్ లో నమోదు చేయాలి.
- క్రయ విక్రయదారుల పేర్లు, ఆధార్ నంబర్, కుటుంబసభ్యుల వివరాలు, వయస్సు, వృత్తి, కులం, పాన్‌కార్డు నంబర్ లేదా ఫారం 60, 61, ఇతర వివరాలు ఇంగ్లీషులో నమోదు చేయాలి.
- తద్వారా లభించిన వివరాలకు సంబంధించిన పట్టిక మేరకు ఈ–చలాన్ జనరేట్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ ఫీజులను చెల్లించాలి.
- తరువాత భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి సాక్షుల వివరాలు నమోదు చేయాలి.
- ఈ వివరాలతో రూపొందించిన దస్తావేజును ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్పుడు క్రయ, విక్రయదారులు కోరుకున్న సమయం మేరకు స్లాట్‌బుక్ అవుతుంది. ఈ మేరకు ధరణిలోనే ఆన్‌లైన్ రసీదు కూడా వస్తుంది. దీంతో క్రయ, విక్రయదారుల పని పూర్తవుతుంది.
- <script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>
ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత రెవెన్యూ అధికారులు వర్క్ స్టార్ట్
- DEO (డేటా ఎంట్రీ ఆపరేటర్) లాగిన్ ద్వారా… సాక్షుల పరిశీలన, నమోదు పూర్తయిన వెంటనే రిజిస్ట్రేషన్ లావాదేవీలకు అవసరమైన వ్యక్తుల బయోమెట్రిక్, ఫొటోలను DEO Onlineలో తీసుకుంటారు.
- తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్టార్ లాగిన్ ద్వారా ఆ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అప్లికేషన్, స్టాంపు డ్యూటీ వివరాలు, బయోమెట్రిక్, ఈ–చలాన్ తదితర వివరాలను పరిశీలించి రిజి్రస్టేషన్‌కు అనుమతి ఇస్తారు.
- తహసీల్దార్ పర్మిషన్ ఇచ్చిన వెంటనే దస్తావేజుకు నంబర్ కేటాయించబడుతుంది.
- మళ్లీ DEOద్వారా ఎండార్స్‌మెంట్ జరుగుతుంది. అప్పుడు సదరు దస్తావేజు స్కానింగ్ ద్వారా ప్రక్రియ ప్రారంభమై డాక్యుమెంట్ తయారవుతుంది. ఈ డాక్యుమెంట్‌ను DEO ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.
- మళ్లీ తహసీల్దార్ లేదా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ తన లాగిన్ ద్వారా మ్యుటేషన్, డిజిటల్ సంతకం ప్రక్రియను పూర్తి చేస్తారు.
- ఇది పూర్తయిన వెంటనే డాక్యుమెంట్ ప్రింట్ ఆప్షన్ నొక్కడంతో సదరు రిజి్రస్టేషన్‌కు సంబంధించిన కొత్త పాస్‌పుస్తకం వస్తుంది. దీంతో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. రైతులకు సంబంధించిన భూమికి సంబంధించి పాసుపుస్తకం రైతు చేతికి వస్తుంది.