TG Police Badges : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పోలీసు బ్యాడ్జీల్లో మార్పులు..!
TG Police Badges : ఇటీవలే టీఎస్ ఉన్న పేరును టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణ పోలీసు బ్యాడ్జీల్లో కూడా కొత్త మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది.

Telangana Governments decision to make changes in police badges
TG Police Badges : పోలీసు బ్యాడ్జీల్లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే టీఎస్ ఉన్న పేరును టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణ పోలీసు బ్యాడ్జీల్లో కూడా కొత్త మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు. బ్యాడ్జీల్లో ఏ విధంగా లోగో ఉండాలో కూడా సూచిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీఎస్పీ స్థానంలో టీజీపీ, తెలంగాణ స్టేట్ పోలీసు స్థానంలో తెలంగాణ పోలీసు ఉండనున్నాయి.
టీఎస్ఎస్పీ స్థానంలో టీజీఎస్పీ , టీఎస్పీఎస్ స్థానంలో టీజీపీఎస్ ఉండే విధంగా బ్యాడ్జిలను రూపొందించినట్టు తెలుస్తోంది.
Read Also : Narayana Murthy : ‘నన్ను క్షమించండి.. పని గంటలపై నాది అదేమాట.. తుదిశ్వాస వరకు మారదు.. ఇన్ఫోసిస్ మూర్తి