రాష్ట్రంలో చలి తగ్గుతోంది..ఎండలు అధికం

  • Published By: madhu ,Published On : November 21, 2020 / 05:00 AM IST
రాష్ట్రంలో చలి తగ్గుతోంది..ఎండలు అధికం

Updated On : November 21, 2020 / 6:43 AM IST

cold is decreasing in the Telangana state : తెలంగాణ రాష్ట్రంలో చలి తగ్గుతోంది. సీజన్ మొదట్లో చలి వణికించింది. కానీ..క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా..పగటి ఉష్ణోగ్రతలు సైతం అదేస్థాయిలో అధికమౌతున్నాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. 2 నుంచి 3 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది.



ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో చలి అధికంగా ఉంటుందని తొలుత అంచనా వేశారు. కానీ..ప్రస్తుతం ఉష్ణోగ్రతల నమోదులో వ్యత్యాసం కనిపిస్తోంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తోందంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలు అధికమౌతుండడం గమనార్హం. దుండిగల్ లో 18.6 డిగ్రీల కనిష్ట, ఆదిలాబాద్ లో 34.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాలు మినహా..గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే..1.3 డిగ్రీల నుంచి 3.7 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.



మరోవైపు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హిందూ మహా సముద్రం ఆనుకుని ఉన్న..ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపారు. దీని కారణంగా బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో నవంబర్ 23వ తేదీ అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.