యువకుడిని అడవిలోకి ఈడ్చుకెళ్లిన పులి

  • Published By: bheemraj ,Published On : November 11, 2020 / 03:32 PM IST
యువకుడిని అడవిలోకి ఈడ్చుకెళ్లిన పులి

Updated On : November 11, 2020 / 7:02 PM IST

tiger kill Young man : అసిఫాబాద్ జిల్లాలో పెద్దపుల్లి కలకలం రేపింది. దహేగాం మండలం దిగిడలో యువకుడిపై పెద్దపులి దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లింది. తీవ్ర గాయాలు కావడంతో యువకుడు మృతి చెందాడు. యువకుడు దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ గా గుర్తించారు.



ఇద్దరు యువకులు దిగిడ గ్రామం శివారులో చేపల వేటకు వెళ్లారు. విఘ్నేష్ పై పెద్దపులి దాడి చేయడంతో మరో యువకుడు గ్రామంలోకి పరిగెత్తాడు. విఘ్నేష్ డిగ్రీ చదువుతున్నాడు. యువకుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.



ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకుని పెద్దపుల్లిని బంధించాలని కోరుతున్నారు. విఘ్నేష్ కోసం అటవీశాఖ అధికారులు అడవిలో గాలిస్తున్నారు.