అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు రేవంత్‌రెడ్డి పాదయాత్ర

MP Revanth Reddy Padayatra : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టింది. అయితే అచ్చంపేటలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అచ్చంపేట నుంచి పాదయాత్రగా బయలు దేరారు. రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయాలని మల్లు రవి, సీతక్క కోరారు.
మల్లు రవి, సీతక్క ప్రతిపాదనను ఆమోదిస్తూ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున నినాదాలు వచ్చాయి. రాజీవ్ రైతు భరోసా దీక్షను అప్పటికప్పుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రగా మార్చుకున్నారు. రైతు భరోసా పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. రైతన్నల కోసం అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తానని తెలిపారు.