Vaccine Rate : వ్యాక్సిన్ ధరపై కేంద్రం పునరాలోచించుకోవాలి ..ఈటల
18 సంవత్సరములు పైబడిన వారంతా వ్యాక్సిన్ కొనుక్కొని వేయించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Ts Health Minister Etela Rajender Comments On Vaccine Rate
Vaccine Rate : 18 సంవత్సరములు పైబడిన వారంతా వ్యాక్సిన్ కొనుక్కొని వేయించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలను కాపాడుకోటానికి కేంద్రం వ్యాక్సిన్ సప్లయ్ చేయాలని ఆయన అన్నారు.
వ్యాక్సిన్ తయారీదారులు కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రాలకు ఒక రేటుకు అమ్మటం ఏ న్యాయ శాస్త్రంలో ఉందో వారే చెప్పాలని అన్నారు. ఇది ఏవ్వరూ అంగీకరించరని. అత్యంత బాధాకరమైన విషయం అని ఆయన ఆవేదనవ్యక్తంచేశారు.
ఈ విషయమై కేంద్ర ఒకసారి పునరాలోచన చేసి వ్యాక్సిన్ అందించాలని ఆయన కోరారు. ఇప్పటికే మన దగ్గర తయారైన వ్యాక్సిన్ ఇతర దేశాలకు తరలి వెళ్లిపోయిందని…ఇంకా తరలి పోతే చరిత్ర క్షమించదని ఆయన అన్నారు.