ఒక్కో కరోనా పేషెంట్‌కి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా..?

కరోనా సోకిందని సమాచారం వస్తే చాలు.. ఇంటికెళ్లి వారిని హాస్పిటల్ తీసుకెళ్తోంది. ట్రీట్ చేస్తోంది. కోలుకున్నాక సొంత ఖర్చులతో డిశ్చార్జ్ చేస్తోంది. లాక్‌డౌన్‌తో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు క్లోజ్. 95శాతం మేర రాబడి పడిపోయింది. అయినా కరోనా కట్టడికి కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
పాజిటివ్ వ్యక్తులకు గాంధీ హాస్పిటల్‌లో నాణ్యమైన సేవలు అందిస్తోందని కేంద్ర బృందం మెచ్చుకుంది. ఖర్చుకు వెనుకాడకుండా, ఒక్కో బాధితుడిపై లక్షలు వెచ్చిస్తూ ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకుంటోందని అంది. వైరస్
నిర్ధారణ పరీక్ష నుంచి.. కోలుకొని డిశ్చార్జి అయ్యేవరకు ఒక్కో వ్యక్తికి అయ్య ఖర్చు.. రూ.3.5 లక్షలు. ఇది వైద్య నిపుణులు లెక్కగట్టి చెబుతున్న పక్కా లెక్క. ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులకు దాదాపు 36.54 కోట్ల రూపాయలు వెచ్చించగా.. డిశ్చార్జ్ అయినవారికి 16.24 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు అంచనా.
కరోనా నిర్ధారణ పరీక్షకు ఖర్చు రూ. 4,500. పాజిటివ్ కేసులకు ట్రీట్ మెంట్ తర్వాతా మరో రెండుసార్లు నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇలా ఒక్కొక్కరికీ రూ. 13,500 వ్యయం. అనుమానితులను అంబులెన్స్‌లోనే హాస్పిటల్ తీసుకెళ్లి టెస్టులు చేస్తారు. కోలుకొని డిశ్చార్జి అయిన వారిని ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వమే వాహనం ఏర్పాటు చేస్తుంది. రవాణా ఖర్చు రూ. 4 వేలు. పాజిటివ్ వ్యక్తులు కోలుకునే వరకు కనీసం దాదాపు 80 వరకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కిట్లు వాడతారు. ఈ కిట్లు రెండోసారి పనికిరావు. పీపీఈ కిట్ ధర రూ. 2,500. అంటే పీపీఈ కిట్ల కోసమే రూ.2లక్షల దాకా ఖర్చు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే ఎక్కువ మొత్తంలో పీపీఈ కిట్లు మార్చాల్సి ఉంటుంది.
ఇక, కొవిడ్ సోకిన వారిలో రోగ నిరోధకశక్తి పెంచేందుకు, antibiotic medicine, antiviral drugs,fluids, ఇతరత్రా మెడిసిన్‌కి మరో 50వేలు. గాంధీలో చికిత్స పొందుతున్న వారికి ప్రత్యేక మెనూతో, బలవర్ధకమైన తిండిపెడుతున్నారు. ఉదయం అల్పాహారం, రెండుసార్లు భోజనం, డ్రైఫ్రూట్స్, పాలు, బ్రెడ్, నాలుగు వాటర్ బాటిళ్లు అందజేస్తున్నారు.
నిజానికి కరోనా మెనూ చాలా ఖరీదు. ఇందుకోసమే రూ.55వేలు ఖర్చు. సబ్బులు, శానిటైజర్, ప్రత్యేక డ్రెస్‌లాంటి వాటికోసం మరో రూ. 27వేలు. కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల్లో వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని బట్టి చికిత్సకు సమయం పడుతుంది. సాధారణంగా 14 రోజుల్లో కోలుకొని డిశ్చార్జి అవుతారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే 21 రోజుల వరకు చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆమేరకు వ్యయం పెరుగుతుంది.
See Also | ప్రాణాలకంటే ఆదాయమే ముఖ్యమా : మద్యం షాపులు ఓపెన్..మరి తెలంగాణలో