YS Sharmila: ఆత్మలు అమ్ముకుని చేతులు కలుపుతున్న వీరి నీచక్రీడలను.. : షర్మిల

బీజేపీ ముఖ్యమంత్రులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అమిత్ షా అపాయింట్‌మెంట్ గాలికంటే వేగంగా కేటీఆర్ కు దొరుకుతుందని చెప్పారు.

YS Sharmila: ఆత్మలు అమ్ముకుని చేతులు కలుపుతున్న వీరి నీచక్రీడలను.. : షర్మిల

YS Sharmila

Updated On : June 24, 2023 / 3:40 PM IST

YS Sharmila – YSRTP: తెలంగాణ (Telangana) ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నట్లుగా వ్యవహారం ఉందని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాను తెలంగాణ మంత్రి కేటీఆర్ కలవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సిగ్గులేకుండా, ఆత్మలు అమ్ముకుని చేతులు కలుపుతున్నారని, వీరి నీచక్రీడలను నాలుగు కోట్ల ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వీరి స్నేహానికి బొందపెడతారంటూ ట్వీట్ చేశారు.

” కుళ్లుకాయలను బంగారు సంచిలో దాచినా కంపు బయటపడదా ఏంటి? అలాగే ఉంది.. బీఆర్ఎస్, బీజేపీ అక్రమ మైత్రి. ఎంతదాచినా దాగదులే అన్నట్టు… గల్లీలో సిగపట్లు, ఢిల్లీలో కౌగిలింతలు.. నిజం కాదని నిరూపించగలరా? బిహార్ లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి మీకు ఆహ్వానం ఎందుకు అందలేదో చెప్పే దమ్ముందా మీకు?

బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీపై కేసీఆర్ తీరు సరిగా లేదని చెప్పేశారు… మరోవైపు శరద్ పవార్ అయితే ఏకంగా బీజేపీ , బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు.. ఇంకా మీ నాటకాలు దేనికి? తమిళనాడు మాజీ మంత్రిని ఎంత రాక్షసంగా అరెస్టు చేశారో చూశాం, మరి బలమైన సాక్షాలున్నాయంటూ కవితను నాలుగుసార్లు ఆఫీసుల చుట్టూ తిప్పిన సీబీఐ, ఆ తరువాత ఆమెను అరెస్టు ఎందుకు చేయదు?

అసలు జాబితాలో ఆమె పేరే ఉండకపోవడమేందో! ఆమె కడిగిన ముత్యమా, లేక మీది కుదిరిన బంధమా? తెలంగాణ మంత్రుల మీద ఈడీ దాడులుంటాయి, కానీ అరెస్టులు ఉండవు. కాళేశ్వరం మీద నేను నిరంతరం పోరాటం చేస్తున్నా భాజపా మంత్రులు పనికిమాలిన ప్రకటనలు చేస్తారు తప్ప చర్యలుండవు.. ఇంతలో కేసీఆర్ బీజేపీని పెద్దమనసుతో క్షమించేసి సభాముఖంగా దాడులు చేయడం బంద్ చేస్తారు.

ఆయన కుమారుడు ఆగమేఘాల మీద ఢిల్లీకి పోయి అమిత్ షాను కలుస్తాడు. బీజేపీ ముఖ్యమంత్రులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అపాయింట్ మెంట్ గాలికంటే వేగంగా ఈయనకు దొరుకుతుంది. సమాజ్దార్ కో ఇషారా కాఫీ అన్నట్టు.. సిగ్గులేకుండా, ఆత్మలు అమ్ముకుని చేతులు కలుపుతున్న వీరి నీచక్రీడలను నాలుగు కోట్ల ప్రజలు గమనిస్తున్నారు. వీరి స్నేహానికి బొందపెడతారు” అని షర్మిల పేర్కొన్నారు.

Sikki Reddy Mother: కేపీ చౌదరికి డ్రగ్స్ అలవాటు ఉందని మాకు తెలియదు.. నా బిడ్డకు అతనితో ఎలాంటి పరిచయం లేదు