YS Sharmila: ఊర్లు మునిగినా, ఇండ్లు కూలినా.. జనం వరదల్లో పడి కొట్టుకుపోతున్నా..: షర్మిల

వర్షాలు వెలిశాక చుట్టం చూపుగా వస్తారని, గాలి మోటార్లో చక్కర్లు కొడతారని షర్మిల ఎద్దేవా చేశారు.

YS Sharmila: ఊర్లు మునిగినా, ఇండ్లు కూలినా.. జనం వరదల్లో పడి కొట్టుకుపోతున్నా..: షర్మిల

YS Sharmila

Updated On : July 28, 2023 / 4:56 PM IST

YS Sharmila – Telangana Rains: తెలంగాణ ప్రజలు వర్షాలకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR ) ఆయన ఇంటిని దాటి బయటకు రావడం లేదని వైఎస్సార్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ఊర్లు మునిగినా,ఇండ్లు కూలినా.. ప్రజలు వరదల్లో పడి కొట్టుకుపోతున్నా దొర గడీ దాటి బయటకు రారని, ప్రజలను ఆదుకోరని అన్నారు.

వర్షాలు వెలిశాక చుట్టం చూపుగా వస్తారని, గాలి మోటార్లో చక్కర్లు కొడతారని షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజలను ఆదుకుంటామని ఎన్నో వ్యాఖ్యలు చేస్తారని, ఇంటికి పది వేల రూపాయలు, పంటకు పదివేల రూపాయలు అనే ప్రకటనలు ఇస్తారని అన్నారు. అనంతరం వెంటనే ఫామ్ హౌస్ కు కొచ్చి మొద్దు నిద్ర పోతారని చెప్పారు. 9 ఏళ్లుగా భారీ వర్షాలకు, అకాల వర్షాలకు, వేల కోట్ల పరిహారం అంటూ చెప్పుడే తప్పా రూపాయి ఇచ్చింది లేదని విమర్శించారు.

కనీసం వరదల్లో కొట్టుకుపోయిన వారి కుటుంబాలను ఆదుకున్నదీ లేదని షర్మిల అన్నారు. ఓట్ల కోసం కల్లబొల్లి మాటలు చెబుతారని, వరదల్లో జనాన్ని నిండా ముంచుతారని చెప్పారు. ఇదే పిట్టల దొర పాలన అని ఎద్దేవా చేశారు. వరదల్లో వరంగల్ మునగకుండా మూడేళ్ల క్రింద మాస్టర్ ప్లాన్ అని చెప్పినా ఫైల్ కదల్లేదని అన్నారు. రూ.250 కోట్లు తక్షణం ఇవ్వండని అడిగినా పైసా ఇవ్వలేదని తెలిపారు.

వెయ్యి కోట్లతో భద్రాచలం కరకట్ట అని చెప్పారని, ఆ హామీని సైతం గోదాట్లోనే కలిపారని షర్మిల విమర్శించారు. ప్రశ్నించే ప్రతిపక్షాలది చిల్లర రాజకీయమైతే ప్రజలను వరదల్లో పెట్టి, బురదలో నెట్టి కేసీఆర్ చేసేదాన్ని ఏమనాలని నిలదీశారు. ఎన్నికల ముందైనా వర్షాలతో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవాలని కోరారు.

Zebra line On Road : వర్షాకాలంలో జీబ్రా లైన్ దాటేటప్పుడు బీ కేర్ ఫుల్ .. తెలుపురంగుపై ‘అడుగు’ జాగ్రత్త ఎందుకంటే..