మూడు రాజధానుల రగడ, సేఫ్‌గా బయటపడేలా పవన్ వ్యూహం

ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అమరావతి విషయంలో ఆ ప్రాంత పరిధిలోని టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే పదవులను వదులుకుని ప్రత్యక్ష పోరాటంలోకి రావాలన్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. పవన్ డిమాండ్ వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు. మూడు రాజధానుల విషయంలో ఓ ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తే మరో ప్రాంతంలో ఇబ్బంది తప్పదు. దీంతో ఈ విషయంలో తాను తప్పించుకొని, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు పెడితే బెటర్ అన్న ఆలోచనతోనే ఈ వాదన ముందుకు తీసుకొచ్చారని అంటున్నారు.