మళ్లీ చెడ్డీగ్యాంగ్ హల్ చల్ : కత్తులతో బెదిరించి దోచేశారు

  • Published By: veegamteam ,Published On : November 4, 2019 / 05:54 AM IST
మళ్లీ చెడ్డీగ్యాంగ్ హల్ చల్ : కత్తులతో బెదిరించి దోచేశారు

Updated On : November 4, 2019 / 5:54 AM IST

నిజామాబాద్ నగర శివారుల్లో చెడ్డీ గ్యాంగ్  మరోసారి చెలరేగిపోయింది.  న్యాల్ కల్ రోడ్డులో ఉన్న లలితాంబ ఆలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లో దోపిడికి పాల్పడింది. ఇంట్లో చొరబడ్డ చెడ్డీ గ్యాంగ్ కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించారు. నోరు ఎత్తితో పొడిచేస్తామని హెచ్చరించారు.

అనంతరం ఇంట్లో ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. తరువాత ఇంట్లో సొమ్మంతా దోచుకుపోయారు.  దోచుకుపోయినా సొమ్ములో 16 తులాల బంగారం, రూ.50వేలు నగదుతో పాటు పలు విలువైన వస్తువులు ఉన్నాయి. 

నిజామాబాద్ లో గత కొంతకాలంగా హల్ చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ ఇళ్లల్లోను, షాపుల్లోను  దోపిడీలకు పాల్పడుతున్నారు. అడ్డు వచ్చినవారిని కత్తులతో బెదిరిస్తున్నారు. అందినకాడికి దోచుకెళ్లుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవటానికి పోలీసులు ఎంత నిఘా పెట్టినా..ఎక్కడోక చోట ఈ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతునే ఉంది. స్థానికులకు నిద్ర లేకుండా చేస్తోంది. తీవ్ర భయాందోళనలకు సృష్టిస్తోంది.