ఏపీలో 572కి చేరిన కరోనా కేసులు, ఆ రెండు జిల్లాల్లోనే 252 కేసులు నమోదు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం(ఏప్రిల్ 17,2020) కొత్తగా మరో 38 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో తెలియజేశారు. వీటిలో

  • Published By: veegamteam ,Published On : April 17, 2020 / 07:58 AM IST
ఏపీలో 572కి చేరిన కరోనా కేసులు, ఆ రెండు జిల్లాల్లోనే 252 కేసులు నమోదు

Updated On : April 17, 2020 / 7:58 AM IST

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం(ఏప్రిల్ 17,2020) కొత్తగా మరో 38 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో తెలియజేశారు. వీటిలో

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం(ఏప్రిల్ 17,2020) కొత్తగా మరో 38 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో తెలియజేశారు. వీటిలో కర్నూలు జిల్లాలో 13(మొత్తం 126), కృష్ణా జిల్లా 5, నెల్లూరు జిల్లా 6, అనంతపురం జిల్లాలో 5 గుంటూరు జిల్లా 4(మొత్తం 126), చిత్తూరు జిల్లా 4, కడప జిల్లాలో ఒక్క కేసు నమోదైంది. ఈ 38 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కు పెరిగింది. ఇందులో యాక్టివ్ కేసులు 523. వీరంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 35మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో 14మంది చనిపోయారు. గురువారం(ఏప్రిల్ 16,2020) కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి ఎక్కువమంది డిశ్చార్జ్ అవడం ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించే అంశం.

రాష్ట్రంలో కరోనా కేసుల్లో గుంటూరు(126), కర్నూలు(126)జిల్లాలు టాప్‌లో ఉన్నాయి. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.

గుంటూరు జిల్లా -126
కర్నూలు జిల్లా -126
నెల్లూరు జిల్లా -64
కృష్ణా జిల్లా -52
ప్రకాశం జిల్లా – 42
కడప జిల్లా – 37
పశ్చిమ గోదావరి జిల్లా – 34
చిత్తూరు జిల్లా – 28
విశాఖపట్నం జిల్లా -20
తూర్పుగోదావరి జిల్లా – 17
అనంతపురం జిల్లా -26
మొత్తం కేసులు -572