లాంగ్ మార్చ్‌లో పవన్ కళ్యాణ్.. జీపు ఎక్కిన జనసేనాని

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ఇసుక కొరతను తీర్చాలంటూ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ లాంగ్‌మార్చ్ చేపట్టారు. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవాలంటూ చేపట్టిన లాంగ్ మార్చ్ ప్రారంభం అయ్యింది. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పవన్ లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్నారు.
ఈ లాంగ్‌మార్చ్ రామాటాకీస్, ఆశీల్‌మెట్ట జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో జనం విపరీతంగా చేరకోవడంతో పవన్ కళ్యాణ్ అడుగులో అడుగు వేశారు. అయితే జనాల తోపులాట ఎక్కువ కావడంతో పవన్ కళ్యాణ్ జీపు ఎక్కి మార్చ్‌లో ముందుకు సాగుతున్నారు.
ఇక ఈ మార్చ్ కాస్త ఆలస్యంగా సాగుతుంది. జనాలు పవన్ కళ్యాణ్ జీపును ముందుకు సాగనివ్వట్లేదు. ఈ ర్యాలీకి టీడీపీ, బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది. టీడీపీ తరఫున సీనియర్ నేతలు లాంగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు, భవన నిర్మాణ కార్మికులు ర్యాలీలో పాల్గొంటున్నారు.