వర్మకు చేదు అనుభవం
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు చేదు అనుభవం ఎదురైంది. కొమరగిరి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనను.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు చేదు అనుభవం ఎదురైంది. కొమరగిరి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనను.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు చేదు అనుభవం ఎదురైంది. కొమరగిరి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనను.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ అడ్డుపడ్డారు. వర్మ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
Read Also : పెద్దపల్లి రాజకీయాలు : BSP అభ్యర్థిగా వివేక్ ?
ఐదేళ్లలో ఎమ్మెల్యే వల్ల తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని… మళ్లీ ఓట్లు అడగటానికి ఎలా వస్తున్నారంటూ నిలదీశారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. వర్మసైతం తాను బైటి ఊరివాడిని కాదని…. దమ్ముంటే అడ్డుకుని చూడండంటూ సవాల్ విసిరారు. మీ అంతు చూస్తానంటూ హెచ్చరించారు.