జనసేన పంచె రాజకీయం : అప్పుడు పంచెలూడదీస్తా.. ఇప్పుడు పంచెకట్టే గౌరవం

జాతీయ స్థాయిలో నేను తెలుగు వాడిని అని చెప్పేందుకే పంచె కడుతున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుపడుతున్నారు.

  • Published By: vamsi ,Published On : April 1, 2019 / 08:36 AM IST
జనసేన పంచె రాజకీయం : అప్పుడు పంచెలూడదీస్తా.. ఇప్పుడు పంచెకట్టే గౌరవం

Updated On : April 1, 2019 / 8:36 AM IST

జాతీయ స్థాయిలో నేను తెలుగు వాడిని అని చెప్పేందుకే పంచె కడుతున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుపడుతున్నారు.

జాతీయ స్థాయిలో నేను తెలుగు వాడిని అని చెప్పేందుకే పంచె కడుతున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఇటీవలికాలంలో తను పంచె మాత్రమే ఎందుకు కట్టుకుని తిరుగుతున్నానంటే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక పంచె అని దేశ వ్యాప్తంగా పంచె కట్టు సంప్రదాయం గురించి చర్చ జరగడానికి పంచె కట్టుకున్నట్లు చెప్పారు.
Read Also : మోహన్ బాబు ఊసరవెల్లి : పారితోషికం ఎంత అందింది – బుద్ధా వెంకన్న

కాగా పవన్ కళ్యాణ్ పంచె కట్టు అంశంపై నెటిజన్‌లు రియాక్ట్ అవుతున్నారు. పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి ఎందరో నేతలు పంచెకట్టి తెలుగు వారి గౌరవాన్ని నిలిపారని, ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ చేసేదేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అలాగే గతంలో పంచెలు ఊడగొడతా.. అంటూ తెలుగువారి పంచెని వెటకారం చేశాడంట.. ఇప్పుడు ఓట్లు కోసం తెలుగు వారి పంచె కట్టులోని నిండుదనం గురించి మట్లాడుతున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. 

 

దోతీ అనేది తెలుగువారిదే కాదు భారతీయ సాంప్రదాయం అని అనేకమంది గొప్ప లీడర్లు పంచె వేసుకుని ఖ్యాతి గడించారని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.

 ముందు స్టేట్‌లో చూడు స్వామి, మా విజయవాడ వాళ్లు నిన్న టీడీపీ బీ టీమ్ అంటున్నారు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.