షర్మిల జోస్యం : పవన్ జనసేనను టీడీపీలో కలిపేస్తారు
గుంటూరు : పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని తెలుగు దేశం పార్టీలో కలిపేస్తారని వైసీపీ నేత షర్మిల జోస్యం చెప్పారు. గుంటూరులో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో షర్మిల పాల్గొన్నారు.

గుంటూరు : పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని తెలుగు దేశం పార్టీలో కలిపేస్తారని వైసీపీ నేత షర్మిల జోస్యం చెప్పారు. గుంటూరులో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో షర్మిల పాల్గొన్నారు.
గుంటూరు : పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని తెలుగు దేశం పార్టీలో కలిపేస్తారని వైసీపీ నేత షర్మిల జోస్యం చెప్పారు. గుంటూరులో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో షర్మిల పాల్గొన్నారు. రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్ అని.. చంద్రబాబు డైరెక్టర్ అని షర్మిల అన్నారు. డైరెక్టర్ చెప్పిందే ఆ యాక్టర్ చేస్తున్నారు అని విమర్శించారు. పవన్ కు ఓటు వేస్తే, టీడీపీకి ఓటు వేసినట్లే అని చెప్పారు.
చంద్రబాబుది రోజుకో మాట.. పూటకో వేషం అని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబుని చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుతో పారిపోతుందన్నారు. వైసీపీకి ఏ పార్టీతోనూ పొత్తులు లేవని షర్మిల మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు వస్తే రాష్ట్రంలో కరువొచ్చిందన్న షర్మిల.. చంద్రబాబుని సాగనంపాలని కోరారు. బైబై బాబు.. అనేది ప్రజాతీర్పు కావాలన్నారు. వైసీపీ తరుఫున షర్మిల ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, జనసేన టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. రోజుకో మోసం, పూటకో అబద్దం చెప్పి చంద్రబాబు ఈ ఐదేళ్లు గడిపేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని కోరారు. జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.