చంద్రగిరిలో టెన్షన్ : తలలు పగలకొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యకర్తలు
చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలోని పనబాక హరిజనవాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారం వివాదానికి దారితీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలోని పనబాక హరిజనవాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారం వివాదానికి దారితీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలోని పనపాకం హరిజనవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారం వివాదానికి దారితీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తలలు పగలకొట్టుకున్నారు. ఈ దాడిలో 10మంది టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘర్షణ జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Read Also : మే 23 తర్వాత ఫ్యాన్ ఇంటికి, గ్లాస్ బార్‌కి : బాలయ్య సెటైర్
పోలింగ్ కు సమయం ముంచుకొస్తున్న వేళ చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శనివారం(మార్చి 30, 2019) అర్థరాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రెండు పార్టీలకు చెందిన నాయకులు ప్రచారం చేసి వెళ్లిపోయారు. తమను ఓటు హక్కు వినియోగించుకోనివ్వడం లేదని, పోలింగ్ బూత్ కు కూడా వెళ్లనివ్వడం లేదని, స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని హరిజనవాడకు చెందిన ప్రజలు రెండు పార్టీల నాయకులు ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదుతో రాత్రి 12గంటల ప్రాంతంలో టీడీపీ, వైసీపీకి చెందిన నాయకులు హరిజనవాడకు వచ్చారు. ఓటు వెయ్యకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్నది ఎవరో చెప్పాలని వారిని నిలదీశారు. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఆగ్రహంతో కర్రలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో 10మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని హరిజనవాడ వాసులు భయాందోళన చెందుతున్నారు.
Read Also : అజ్ఞాతంలోకి రాజకీయ రౌడీలు: ఎన్నికలు టార్గెట్ చేశారా?