దళితుల ఓట్లు చీల్చేందుకే: పవన్ మాట మార్చాడు

  • Published By: vamsi ,Published On : March 23, 2019 / 01:16 AM IST
దళితుల ఓట్లు చీల్చేందుకే: పవన్ మాట మార్చాడు

Updated On : March 23, 2019 / 1:16 AM IST

తెలుగుదేశం, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. లోకేష్ అవినీతి గురించి ప్రశ్నించిన పవన్ కళ్యాణ్..  ఇప్పుడు మాట మార్చారంటూ మండిపడ్డారు. నగరి నియోజకవర్గంలో దళితుల ఓట్లు చీల్చేందుకు ఇక్కడ బీఎస్పీకి పవన్ సీటు కేటాయించారంటూ విమర్శించారు.

రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని, రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్‌ సీపీ వైపే చూస్తున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు ధోరణి అవలంబించిన చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయమని, ఆయన పాలనలో నగరి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని రోజా హామీ ఇచ్చారు.
Read Also : వైసీపీ షాకింగ్ డెసిషన్ : హిందూపురం బరిలో గోరంట్ల మాధవ్ భార్య