ఏం దాచాడో అక్కడ :కదిలితే కుట్టి చంపేస్తాయి!

తేనెతుట్టె అనగానే.. తియ్యని తేనె గుర్తుకు వస్తుంది. నోరూరే తేనె తాగితే పర్వాలేదు. ఆరోగ్యం కూడా. ఇలా ఏకంగా తేనెతుట్టెనే ఒంటిపై పెట్టేసుకుంటే ఎలా? పొరపాటున కుట్టాయా అంతే సంగతులు.

  • Published By: sreehari ,Published On : August 22, 2019 / 12:04 PM IST
ఏం దాచాడో అక్కడ :కదిలితే కుట్టి చంపేస్తాయి!

Updated On : August 22, 2019 / 12:04 PM IST

తేనెతుట్టె అనగానే.. తియ్యని తేనె గుర్తుకు వస్తుంది. నోరూరే తేనె తాగితే పర్వాలేదు. ఆరోగ్యం కూడా. ఇలా ఏకంగా తేనెతుట్టెనే ఒంటిపై పెట్టేసుకుంటే ఎలా? పొరపాటున కుట్టాయా అంతే సంగతులు.

తేనెతుట్టె అనగానే.. తియ్యని తేనె గుర్తుకు వస్తుంది. నోరూరే తేనె తాగితే పర్వాలేదు. ఆరోగ్యం కూడా. ఇలా ఏకంగా తేనెతుట్టెనే ఒంటిపై పెట్టేసుకుంటే ఎలా? పొరపాటున కుట్టాయా అంతే సంగతులు. ఇతగాడి పరిస్థితి కాస్త డిఫరెంట్. తేనెతుట్టె ఎక్కడ పెరిగిందో చూడండి. జీన్స్ పాయింట్ వేసుకున్నాడు సరిపోయింది కానీ.. లేదంటే వెనుక వాచిపోయేది. ఇంతకీ అతడి వెనక బ్యాక్ జీన్స్ పాయింట్ పై తేనెతుట్టె ఎలా వచ్చిందో తెలియదు గానీ, దీనికి సంబంధించి వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కొంచెం కదిలినా వెంటాడి కుట్టేస్తాయి. అతడి బ్యాకు ప్యాకెట్లో ఏమైనా తీపి పదార్థాలు దాచాడా? ఏమో.. ఆ ప్లేస్ బాగా నచ్చినట్టుంది.. అందుకే తేనెటీగలు చుట్టుముట్టాయి.  

సాధారణంగా తేనెకు ఈజీగా తేనెటీగలు ఆకర్షిస్తాయి. అందుకే ఇలా అతడి ప్యాంట్ వెనుక జేబులపై తిష్ట వేశాయి. ఆ తేనెటీగలను కదిలించే ధైర్యం అక్కడి వారెవ్వరూ చేయలేకపోతున్నారు. కదిలితే ఎక్కడ కుడతాయో ఏమోనన్న భయంతో అతడు అలానే నిలబడిపోయాడు. స్నేహితుడు బ్యాక్ ను చుట్టిముట్టిన తేనెటీగలను తరిమికొట్టే ప్రయత్నం మానేసి.. ఫోన్లో వీడియో తీస్తుండి పోయారు. సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఈ వీడియోను బీజేపీ మంత్రి కిరణ్ రిజుజు తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. నాగాలాండ్ లో మాత్రమే ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతాయని ట్వీట్ చేశారు.

నిజానికి నాగాలాండ్‌లో రకరకాల తేనెటీగల జాతులు చాలానే ఉన్నాయి. అపిస్ సెరినా, అపిస్ డోరసటా, అపిస్ లాబ్రోసియా, ఆపిస్ ఫ్లోరియా ప్రాంతాల్లో ఈ తేనెటీగల జాతులు ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోను రిజుజు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 31వేల వ్యూస్.. 3వేల 2వందల లైక్లు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వు అపుకోలేకపోతున్నారు. ఫన్నీ కామెంట్లు పెడుతూ రీట్వీట్లు చేస్తున్నారు. మీరు కూడా చూడండి.. ఈ వీడియో..