శనివారం నుంచి భారీ వర్షాలు

విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం ఏపీ పై అంతగా ఉండదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాగా…. ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 2019,సెప్టెంబర్ రెండో తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖఐఎండీ) గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీని ప్రభావంతో ఆగస్టు 31 శనివారం, సెప్టెంబర్ 1,2 తేదీల్లో కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.