వెదర్ అలర్ట్ : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.

వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.
వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు. ఇది చాలదన్నట్టు మళ్లీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు పడతాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరానికి దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు:
కేసముద్రం (మహబూబాబాద్) 7 సెం.మీ
పైడిపల్లి (వరంగల్ అర్బన్) 7 సెం.మీ
అమ్మనగల్(మహబూబాబాద్) 7 సెం.మీ
కట్టంగూర్ (నల్లగొండ) 7 సెం.మీ
ఎల్లంకి (యాదాద్రి భువనగిరి) 6 సెం.మీ
బొమ్రాస్‌పేట (వికారాబాద్) 6 సెం.మీ
కమ్మర్ పల్లి (నిజామాబాద్) 5 సెం.మీ
రంగంపల్లి(పెద్దపల్లి) 5 సెం.మీ
ఓదెల (పెద్దపల్లి) 5 సెం.మీ
Also Read : గ్రామ సచివాలయ పరీక్షలు : APPSC ఉద్యోగుల కుటుంబసభ్యులకే ర్యాంకులు