Shoulder Pain : మహిళల్లో భుజం నొప్పికి కారణమయ్యే కారకాలు.. పోషకాహరం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు ?

నిశ్చల జీవనశైలి ఫలితంగా భుజం నొప్పి మహిళల్లో పెరుగుతోంది. ఎక్కువ గంటలు డెస్క్ వర్క్ చేయడం వల్ల , వ్యాయామాలు చేయకపోవటం వల్ల భుజం కండరాలు బలహీనపడతాయి. తగినంత కదలిక, శక్తి లేకపోవడం భుజం కీలుపై ఒత్తిడిని కలిగుతుంది.

Shoulder Pain : మహిళల్లో భుజం నొప్పికి కారణమయ్యే కారకాలు.. పోషకాహరం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు ?

shoulderpain

Shoulder Pain : భుజం నొప్పి అసౌకర్యం అనేది చాలా మంది వ్యక్తుల్లో కనిపించే సమస్య. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా భుజం నొప్పితో బాధపడుతుంటారు. ఇటీవలి కాలంలో భుజం నొప్పి సమస్యలు మహిళల్లో సర్వసాధారణంగా మారాయి. భుజం కీలు అనేది సంక్లిష్టమైన నిర్మాణం, ఇది రోజువారిగా పని కార్యకలాపాల్లో విస్తృతమైన కదలికను కలిగి ఉంటుంది. దీని వల్ల కాలక్రమంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.

READ ALSO : Hepatitis : వర్షాకాలంలో హెపటైటిస్ ప్రమాదాన్ని పెంచే కారకాలు, ఆరోగ్యకరమైన కాలేయం కోసం ?

ఈ క్రమంలో రోజువారీ కార్యకలాపాలు, వ్యాయామాల సమయంలో సౌకర్యవంతమైన చేతి కదలికల వల్ల వివిధ కార్యకలాపాలను సులభంగా నిర్వహించడానికి, శారీరక పనితీరును మెరుగుపరచడానికి , శరీరంలోని ఇతర ప్రాంతాలపై ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. అంతేకాకుండా భుజాలు బలంగా ఉంటే రొటేటర్ కఫ్ గాయాలు, ఇంపీమెంట్, డిస్‌లోకేషన్‌లు , స్ట్రెయిన్‌ల వంటి సాధారణ భుజాలకు సంబంధించిన సమస్యలను నిరోధించవచ్చు. బలహీనమైన, అస్థిరమైన భుజాలు గాయాలకు గురవుతాయి.

మహిళల్లో భుజం నొప్పి పెరగడానికి ప్రధాన కారకాలు ;

నిశ్చల జీవనశైలి: నిశ్చల జీవనశైలి ఫలితంగా భుజం నొప్పి మహిళల్లో పెరుగుతోంది. ఎక్కువ గంటలు డెస్క్ వర్క్ చేయడం వల్ల , వ్యాయామాలు చేయకపోవటం వల్ల భుజం కండరాలు బలహీనపడతాయి. తగినంత కదలిక, శక్తి లేకపోవడం భుజం కీలుపై ఒత్తిడిని కలిగుతుంది. అసమతుల్యత ఏర్పడి, ఫలితంగా నొప్పి, అసౌకర్యం ఏర్పడుతుంది.

READ ALSO : Manipur Violence Cases : మణిపుర్ అల్లర్ల కేసుల దర్యాప్తునకు 53 మంది సీబీఐ అధికారులు

కూర్చొనే భంగిమల్లో తేడాలు: అనేక సందర్భాల్లో కూర్చునే భంగిమలు సరిగా లేనప్పుడు మహిళల్లో భుజం నొప్పికి దారి తీస్తుంది. సరైన అమరిక, మంచి ఎర్గోనామిక్స్ , పనిప్రదేశంలో సాగించే కార్యకలాపాల్లో మార్పులు ఒత్తిడి వంటివి భుజం దృఢత్వాన్ని తగ్గించడానికి కారణమౌతాయి.ముందుకు వంగి ఉన్న భంగిమ , మెడ నొప్పికి, భుజాల నొప్పికి దారితీస్తుంది.

పెరుగుతున్న పనిభారం , ఒత్తిడి: మహిళలు వ్యక్తిగత , వృత్తిపరమైన జీవితాలను నిర్వహించవలసి ఉన్నందున చాలా ఎక్కువ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. మహిళలు తరచూ తమను తాము అనేక బాధ్యతలను నిర్వర్తిస్తుంటారు. ఇది ఒత్తిడి స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. భుజాలు , మెడ ఒత్తిడి పెరిగి అసౌకర్యానికి దారితీస్తుంది. ఒత్తిడి వల్ల వచ్చే భుజం నొప్పిని వ్యాయామం, స్వీయ సంరక్షణ విధానాలను ఉపయోగించడం ద్వారా తగ్గించవచ్చు.

READ ALSO : Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఇలా..

మితిమీరిన కదలికలు : టైపింగ్, పెయింటింగ్, క్రీడలు ఆడటం వంటి కార్యకలాపాలలో పదేపదే భుజాలను ఉపయోగించడం వలన అనవసరమైన ఒత్తిడి పడుతుంది. ఫలితంగా అసౌకర్యం, వాపు వస్తుంది. పనిసమయంలో కొంత సమయం విరామం. స్ట్రెచింగ్ రొటీన్‌లు, కొన్ని టెక్నిక్‌లను ఉపయోగించడం వల్ల భుజం గాయాలను నివారించడంలో,భుజం నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

హార్మోన్ల మార్పులు: స్త్రీలు ముఖ్యంగా గర్భధారణ , రుతువిరతి సమయంలో అనుభవించే హార్మోన్ల మార్పుల వల్ల భుజం నొప్పి వస్తుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులు జాయింట్ లాసిటీని ప్రభావితం చేస్తాయి. నొప్పి ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమయంలో, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం, తరచుగా వ్యాయామం చేయడం, సరైన వైద్య సలహాలను పొందడం ద్వారా భుజం నొప్పిని తగ్గించుకోవచ్చు.

READ ALSO : Sitting on the Doorstep : గడప మీద ఎందుకు కూర్చోవద్దంటారో తెలుసా?

వయస్సుసంబంధిత కారకాలు: వయస్సుసంబంధిత కారకాల కారణంగా మహిళలు భుజం నొప్పిని ఎదుర్కొంటారు, దీని ఫలితంగా తరచుగా రోటేటర్ కఫ్ గాయాలు, భుజం ఆస్టియో ఆర్థరైటిస్ ఏర్పడతాయి. రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువు, వయస్సు-సంబంధిత భుజం సమస్యల రాకడను నెమ్మదింప చేస్తాయి.

ఏమి నివారించాలి?

మంచి భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మహిళలు బరువైన బ్యాగులు, పేలవమైన భంగిమ, పదేపదే భుజ కదలికలు ,నొప్పిగా ఉన్న పెద్దగా పట్టించుకోకపోవటం, నిపుణుల పర్యవేక్షణ లేకుండా సొంత వ్యాయామాలు, విరామం తీసుకోకుండా ఎక్కువసేపు కూర్చోవడం, టైప్ చేయడం వంటివి నివారించాలి. భుజాలకు బలాన్నిచ్చే వ్యాయామాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వవ్యవహారించాలి. సమస్యలు, నొప్పిని ఎదుర్కొంటుంటే మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

READ ALSO : Crocodile Attacked : ఓ మై గాడ్.. స్నానం చేస్తుండగా మహిళపై మొసలి దాడి, రెప్పపాటులో దారుణం.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

పోషకాహారం ద్వారా భుజం ఆరోగ్యాన్ని నిర్వహించడం ;

పోషకాహారం ద్వారా భుజం ఆరోగ్యాన్ని నిర్వహించడం అనేది మహిళలకు సమర్థవంతమైన విధానం. సరైన పోషకాహారం ఎముకలు, కండరాలు , కీళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. భుజం కీలు యొక్క బలానికి కొన్ని ఆహార మార్గదర్శకాలు బాగా ఉపకరిస్తాయి.

కాల్షియం , విటమిన్ డి: ముఖ్యంగా భుజం కీళ్లలో బలమైన ఎముకలను నిర్వహించడానికి కాల్షియం, విటమిన్ డి కీలకం. పెద్దలు, ముఖ్యంగా మహిళలు, పాలు, పెరుగు మరియు చీజ్ వంటి పాల ఉత్పత్తులను అలాగే ఆకు కూరలు తీసుకోవాలి.

READ ALSO : Actress Praneetha: ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో బాదం ఉండాల్సిందే

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు : సాల్మన్, ట్యూనా , సార్డినెస్ వంటి చేపలలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ భుజం అసౌకర్యాన్ని తగ్గించటంలో సహాయపడతాయి. అవిసె గింజలు, చియా గింజలు , వాల్‌నట్స్ వంటి మొక్కల ఆధారిత వనరులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. చేప నూనె ,శాఖాహార సప్లిమెంట్లు కూడా మంచి ఎంపికలు.

ప్రోటీన్: కండరాల పెరుగుదల , మరమ్మత్తును నిర్వహించడానికి తగినంత ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరం. స్థిరత్వం , గాయం నివారణకు బలమైన భుజ కండరాలు అవసరం. పెరుగు, చికెన్, చేపలు, బీన్స్ , కాయధాన్యాలు వంటి ప్రోటీన్ యొక్క లీన్ మూలాలు కండరాల పెరుగుదల , మరమ్మత్తు కోసం అవసరమైన అమైనో ఆమ్లాలను సరఫరా చేస్తాయి.

READ ALSO : Nutritious Food : చర్మ సహజ కాంతిని కోల్పోతున్నారా? అయితే పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోవటం బెటర్ !

యాంటీఆక్సిడెంట్లు: యాంటీఆక్సిడెంట్లు భుజాల ఆరోగ్యాన్ని పెంచే వాపు , ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహాయపడతాయి. బెర్రీలు, సిట్రస్ పండ్లు, బచ్చలికూర, కాలే, బెల్ పెప్పర్స్,ఇతర పండ్లు, కూరగాయలు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలను అధికంగా అందిస్తాయి.

హైడ్రేషన్: కీళ్ల ఆరోగ్యానికి తగినంత నీరు త్రాగడం, భుజం కీళ్ల కదలికను సులభతరం చేయడానికి తోడ్పడతాయి. మహిళలు అధిక కాఫీ లేదా చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి. హైడ్రేటెడ్ గా ఉండాలి.

READ ALSO : Madhya Pradesh : ఏడేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా మళ్లీ బాలికపై నిందితుడి అత్యాచారం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, భుజం కండరాలపై ఒత్తిడిని నివారించడం మొత్తం ఆరోగ్య శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. తద్వారా చురుకైన జీవనశైలిని కొనసాగించవచ్చు. ఎముకలు మరియు కీళ్ళు బలంగా ఉంటే గాయాలు నివారించవచ్చు. అవసరమైనప్పుడు వైద్య సహాయాన్ని పొందటంద్వారా భుజాల ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి.