IND vs SL : శ్రేయాస్ అయ్యర్ సూపర్ డైరెక్ట్ త్రో.. షాకైన కమిందు.. వీడియో వైరల్.. రోహిత్ ఏమన్నాడంటే..

ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ వేసిన డైరెక్ట్ త్రో మ్యాచ్ కు హైటెల్ గా నిలిచింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్ ను అర్ష్ దీప్ వేశాడు.

IND vs SL : శ్రేయాస్ అయ్యర్ సూపర్ డైరెక్ట్ త్రో.. షాకైన కమిందు.. వీడియో వైరల్.. రోహిత్ ఏమన్నాడంటే..

shreyas iyer

IND vs SL 2nd ODI : ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. తొలి వన్డే టై కాగా.. రెండో వన్డేలో భారత్ జట్టు ఓటమి పాలైంది. ఆదివారం రాత్రి కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత ఓవర్లలో 240 పరుగులు చేసింది. 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు అద్భుత ఆరంభం లభించింది. రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో 97 పరుగుల వరకు వికెట్ పడలేదు. దీంతో భారత్ విజయం ఖాయమని క్రీడాభిమానులు భావించారు. 13.3 ఓవర్లలో 98 పరుగుల వద్ద రోహిత్ శర్మ (44 బంతుల్లో 64 పరుగులు) ఔట్ అయ్యాడు. కొద్దిసేపటికే మరో ఓపెనర్ శుభమన్ గిల్ (35) ఔట్ అయ్యాడు. దూబె కూడా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఓపెనర్లు ఔట్ అయిన తరువాత ఏ ఒక్కరూ క్రీజులో నిలదొక్కుకోలేక పోయారు. దీంతో 42.2 ఓవర్లలో 208 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది.

Also Read : IND vs SL 2nd ODI 2024: 32 పరుగుల తేడాతో భారత్‌పై శ్రీలంక గెలుపు

శ్రీలంక యువ స్పిన్నర్ వాండర్సే అద్భుత బౌలింగ్ తో టీమిండియా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 10 ఓవర్లు వేసి కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి ఆరు వికెట్లు వాండర్సేవి కావటం గమనార్హం. ఇదిలాఉంటే ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ వేసిన త్రో హైటెల్ గా నిలిచింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్ ను అర్ష్ దీప్ వేశాడు. ఈ ఓవర్ లో కమిందు బాల్ ను బౌండరీ లైన్ వైపు బలంగా కొట్టాడు. శ్రేయాస్ అయ్యర్ బౌండరీ లైన్ వద్ద బాల్ ను అందుకొని వేగంగా వికెట్లవైపు డైరెక్ట్ త్రో విసరడంతో కమిందు రనౌట్ అయ్యాడు.

Also0 Read : IND vs SL : శ్రీలంకకు బిగ్‌షాక్‌.. ఇండియాతో రెండో వన్డేకు కీలక ప్లేయర్ దూరం

శ్రేయాస్ అయ్యర్ దాదాపు బౌండరీ లైన్ దగ్గరలో ఉండటంతో బాల్ కీపర్ చేతికి వచ్చేసరికి రెండో రన్ తీయవచ్చని కమిందు భావించాడు. దీంతో రెండో పరుగుకు ప్రయత్నించాడు. క్రీజులోకి చేరుకొనే సమయంలో శ్రేయాస్ విసిరిన బంతి నేరుగా వచ్చి వికెట్లను తాకింది. ఊహించని పరిణామంతో కమిందు ఒకింత షాకయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ శ్రేయాస్ ను అభినందిస్తూ చిరునవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్ శ్రేయాశ్ అంటూ ప్రశంసిస్తున్నారు.