Ap Eamcet Results : ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు.

Ap Eamcet Results : ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

Ap Eamcet Results

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ (AP EAPCET) ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు అధికారులు మొదట ఎంపీసీ విభాగాల ఫలితాలను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు https://sche.ap.gov.in/EAPCET, https://sche.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను ఈ కింద ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.

ఎంసెట్ పరీక్ష ను ఏపీ ఎంసెట్ ను ఈఏపీసెట్‌ గా మార్చామని మంత్రి ఆది మూలపు సురేష్ తెలిపారు. అయితే కరోనా సోకి ఎవరైనా పరీక్ష రాయలేకపోతే వారికి మళ్లీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఏడాది పరీక్ష రాసినవారిలో ఇంజనీరింగ్ లో 80 శాతం మంది అర్హత సాధించారని చెప్పారు. ఈ ఫలితాలకు సంబంధించి రేపటి నుంచి వెంట్ సైట్ లో ర్యాంక్ కార్డులు పెడుతున్నట్టు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460 మంది ఏపీ ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 80 శాతం మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు. కాగా గత నెల ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఏపీ ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు సెప్టెంబర్ 3,6,7 తేదీల్లో జరిగాయి.