ఏపీ రాజకీయాలపై దుబ్బాక ఫలితం ప్రభావం, అప్రమత్తమైన అధికార పార్టీ

  • Published By: naveen ,Published On : November 24, 2020 / 03:54 PM IST
ఏపీ రాజకీయాలపై దుబ్బాక ఫలితం ప్రభావం, అప్రమత్తమైన అధికార పార్టీ

ap government dubbaka:తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఏపీలో కొత్త అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఫైట్‌ ఉంది. అయితే దుబ్బాక ఫలితాలతో ఇప్పుడు వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నట్టు సమీకరణాలు మారబోతున్నాయని అంచనాలు వేస్తున్నారు.

ఏపీలోనూ మా సత్తా చూపిస్తాం:
దుబ్బాక అసెంబ్లీ స్థానం గెలిచాం.. నెక్స్ట్‌ టార్గెట్ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక అంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. త్వరలోనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో తమ బలం పెంచుకోవాలనుకుంటున్న బీజేపీకి దుబ్బాక ఫలితం కొత్త ఊపు, ఉత్సాహం తెచ్చిందంటున్నారు. ఏపీలోనూ బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామని అంటున్నారు కమలనాథులు.


https://10tv.in/mla-roja-satires-on-pawan-kalyan/
బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్న వైసీపీ:
మరోపక్క, దుబ్బాక ఫలితంతో ఏపీలో అధికార పార్టీ అప్రమత్తం అయ్యిందని అంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు దీటుగా బీజేపీ ఎదుగుతోంది. ఏపీలో బలమైన పార్టీగా ఎదగాలనుకుంటున్న నేపథ్యంలో జాగ్రత్త పడాలనే అభిప్రాయానికి వైసీపీ వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ టీడీపీపై మాత్రమే ఫోకస్ పెట్టిన వైసీపీ.. ఇక నుంచి బీజేపీ మీద కూడా దృష్టి సారించాలని ఫిక్స్‌ అయ్యిందని అంటున్నారు. కాకపోతే తెలంగాణ మాదిరిగా ఏపీలో రాజకీయాలు ఉండవని, టీడీపీని లైట్‌ తీసుకుంటే అసలుకే మోసం వస్తుందనే ఆందోళన కూడా వైసీపీని వెంటాడుతోందని చెబుతున్నారు.

బీజేపీ బలపడితే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయంలో వైసీపీ
ఇప్పటికే టీడీపీ ప్రతి విషయంలో అధికార పార్టీని ఇరకాటంలో పెడుతోంది. దానికి తోడు బీజేపీ బలపడితే తమకు ఇబ్బంది తప్పదనే అభిప్రాయంలో వైసీపీ నేతలు భావిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో దుబ్బాక అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని పార్టీ అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారట. మొత్తానికి దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఏపీ రాజకీయలపై కూడా ప్రభావం చూపుతోందని అన్ని పార్టీల నాయకులు అంటున్నారు. మరి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

https://www.youtube.com/watch?v=I_LhWhliX_0