Botsa Satyanarayana: టీడీపీ నేతలపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ

జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ శుక్రవారం అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు

Botsa Satyanarayana: టీడీపీ నేతలపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ

Botsa

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తెలుగు దేశం నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. శనివారం ఆయన విజయనగరం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పై విరుచుకు పడ్డారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ శుక్రవారం అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇళ్ల వ్యవహారంలో ఇద్దరం కలిసి ఫీల్డ్ కి వెళదాం రావాలి, అచ్చెన్నాయుడు ఎక్కడకు వస్తానంటే అక్కడకు వస్తా.. ఇళ్ల నిర్మాణాల్లో లోటుపాట్లను అచ్చెన్నాయుడు చూపించాలి” అని మంత్రి బొత్స సవాల్ విసిరారు.

Also read: Pawan Kalyan: నరసాపురంకు పవన్ కళ్యాణ్.. రేపే బహిరంగ సభ!
జగనన్న ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షలు ఇస్తామని మ్యానిఫెస్టోలో మేము చెప్పలేదన్నా మంత్రి బొత్స, ఇంటి స్థలం, నిర్మాణానికి డబ్బులు ఇస్తామని మాత్రమే చెప్పామని అన్నారు. పేదలకు అందించే ఇళ్ల నిర్మాణంలో ఎక్కడా రాజీపడొద్దన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు.. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా ఏదోలా ముందుకు వెళ్తున్నామని మంత్రి బొత్స వివరించారు. టిడ్కో ఇళ్ల పై టిడిపి అబద్ధపు ప్రచారం చేస్తుందని, దోచుకుతినటానికే గతంలో టీడీపీ ప్రభుత్వం ఆయా ఇళ్లలో షేర్ వాల్ టెక్నాలజీని తెచ్చారని బొత్స విమర్శించారు. ఇక రాష్ట్రంలో కరెంట్ సమస్యను చంద్రబాబు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బొత్స… ఎన్‌టిపిసికి, ఏపీకి మధ్య రెండు, మూడు రోజులు మాత్రమే కొంత గ్యాప్ వచ్చిందని.. ఇప్పుడు రాష్ట్రంలో యధావిధిగా కరెంట్ ఇస్తున్నామని అన్నారు.

Also read: Telangana : ఫ్రంట్‌ ముచ్చట్లు, మహారాష్ట్రకు సీఎం కేసీఆర్
ఇటీవల లేనిపోని అసత్య కథనాలతో చంద్రబాబు అండ్ కో వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం విధించిన చెత్తపన్ను పై.. టీడీపీ దుష్ప్రచారం చేయటం మంచి పద్ధతి కాదని అన్నారు. పరిశుభ్ర ఆంద్రప్రదేశ్ లో భాగంగా విధి విధానాలను రూపొందించి.. రోజుకు రూపాయి, రెండు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే టీడీపీ నాయకులు కడుపుమంటతో ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య పై వైసీపీ ప్రభుత్వమే సీబీఐ ఎంక్వైరీ వేసిందని గుర్తుచేసిన మంత్రి బొత్స.. వివేకా హత్య కేసులో సీబీఐ, న్యాయస్థానం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూపోతారు, తమ పార్టీకి ఎలాంటి జోక్యం లేదని స్పష్టం చేశారు. సినిమా టిక్కెట్లకు, సినిమా విడుదలకు సంబంధం లేదని, సినిమా విడుదలను బట్టి ముందుకు వెళ్తుంది తప్పా రిలీజ్ ల కోసం విధానాలు ఉండవని మంత్రి బొత్స అన్నారు.

Also read: DGP KV Rajendranath Reddy : గంజాయి నిర్మూలనపై మరింత దృష్టి : ఏపీ డీజీపీ
ఉద్యోగుల సమ్మె జరుగుతుందని చంద్రబాబు అండ్ కో ఎంతో ఊహించిందని, తీరా సమ్మె జరగకపోవడంతో చంద్రబాబు ఆయన మనుషులు నిరుత్సాహానికి గురయ్యారని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యులు, సమ్మె విషయంలో వెనక్కు తగ్గి కమిటీ వేసుకుని సమస్యను పరిష్కరించుకున్నారని మంత్రి బొత్స వివరించారు. ప్రత్యేకహోదాకు వైసీపీ కట్టుబడి ఉందన్న ఆయన.. కేంద్రంపై పోరాటం చేస్తామని అన్నారు. మూడు రాజధానుల బిల్లుకు కొన్ని వ్యవస్థలు అడ్డంకిగా ఉన్నాయని, త్వరలోనే బిల్లు ప్రవేశపెట్టి తీరుతామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. రాజధాని బిల్లుకు డెడ్ లైన్ లేదని అన్నారు.