APSRTC Special Buses : సంక్రాంతికి 1266 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ

సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని  ఏపీఎస్ఆర్టీసీ 1266 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

APSRTC Special Buses : సంక్రాంతికి 1266 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ

Apsrtc Special Buses

APSRTC Special Buses : సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని  ఏపీఎస్ఆర్టీసీ 1266 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

జనవరి 7 నుంచి 17 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. విజయవాడ  నుంచి ఇతర రాష్ట్రాలకు నడిపే బస్సులలో…. హైదరాబాద్ కు 362, బెంగుళూరుకు 14, చెన్నైకు 20 ప్రత్యేక బస్సులు నడుపుతారు.  ఇక విజయవాడ నుంచి రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులు, విజయవాడ రాజమహేంద్రవరం(రాజమండ్రి) మధ్య 360 బస్సులు…రాష్ఠ్రంలోని ఇతర ప్రాంతాలాకు 120 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు చెప్పారు.

Also Read : Migrants Ship Sink In Greece : వలసదారులను తీసుకువెళ్తున్న పడవ మునిగి 11 మంది మృతి

ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులకు సంబంధించి ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్లు ఏపీఎస్ఆర్టీసీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో  చేసుకోవచ్చని అధికారులు వివరించారు.