TTD News: టీటీడీ చరిత్రలో తొలిసారిగా.. మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం సమకూరింది. నిత్యం భక్తుల రద్దీతో తిరుమల కిక్కిరిసిపోతుంది. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా తిరుమలకు భక్తుల రాక తగ్గింది. ఈ వేసవి కాలంలో కొవిడ్ ఆంక్షలు లేకపోవటంతో పాటు కొవిడ్ తీవ్రత తగ్గడంతో భక్తులు భారీ సంఖ్యలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు తిరుమలకు క్యూ కట్టారు.

TTD News: టీటీడీ చరిత్రలో తొలిసారిగా.. మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

Ttd

TTD News: తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం సమకూరింది. నిత్యం భక్తుల రద్దీతో తిరుమల కిక్కిరిసిపోతుంది. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా తిరుమలకు భక్తుల రాక తగ్గింది. ఈ వేసవి కాలంలో కొవిడ్ ఆంక్షలు లేకపోవటంతో పాటు కొవిడ్ తీవ్రత తగ్గడంతో భక్తులు భారీ సంఖ్యలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు తిరుమలకు క్యూ కట్టారు. మే నెలలో రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలుమూలల నుంచి భారీసంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

TTD : ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత సాముహిక వివాహాలు

మే నెలలో సుమారుగా 22.62 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మే నెల స్వామివారి హుండీ ఆదాయం టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా సమకూరినట్లు తెలిపారు. మే నెలలో రూ. 130 కోట్లు ఆదాయం వచ్చిందని, ఒక్క నెలలో ఇంత భారీ మొత్తంలో స్వామివారి హుండీ ఆదాయం రావటం ఇదే తొలిసారి అని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కాగా భక్తుల సౌకర్యార్ధం టైంస్లాట్‌ సర్వదర్శన విధానం పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

TTD Eo dharma reddy: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. గంటన్నరలోపే సర్వదర్శనం

సమస్యలు తలెత్తకుండా తిరుపతిలో టైంస్లాట్‌ టోకెన్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో వీటిని భక్తులకు జారీ చేస్తామని వివరించారు. 2019లో టీటీడీ పథకాలకు 308 కోట్లు రాగా 2021లో రూ.564 కోట్లు వచ్చాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.