Illegal Affair Murder : తన కాపురం నిలబెట్టుకునేందుకు హత్య చేసిన ఇల్లాలు

తన భర్తతో వివాహేతర సంబంధం నడపవద్దని ఎంత హెచ్చిరించినా వినలేదని ఒక మహిళ హత్య చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

Illegal Affair Murder : తన కాపురం నిలబెట్టుకునేందుకు హత్య చేసిన ఇల్లాలు

Extra Marital Affair Murder

Illegal Affair Murder :  తన భర్తతో వివాహేతర సంబంధం నడపవద్దని ఎంత హెచ్చిరించినా వినలేదని ఒక మహిళ హత్య చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

కృష్ణలంక రాణిగారి తోటలో చెందిన రౌతు సత్య(35), అనే మహిళ తన భర్త, కుమార్తెతో నివసిస్తోంది. సత్య నగరపాలక సంస్ధలో స్వీపర్ గా పని చేస్తోంది. భర్తకు తాగుడు, పాన్ పరాగ్ వంటి దరులవాట్లు ఉన్నాయి.  కూతురు సీవీఆర్ హైస్కూల్ లో ఎనిమిదో తరగతి  చదువుతూ అప్పుడప్పుడూ క్యాటరింగ్ పనులకు వెళుతూ ఉండేది.

భర్తకు ఉన్న దురలవాట్ల కారణంగా దంపతులు మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈక్రమంలో సత్యకు అదే ప్రాంతానికి చెందిన  ఒరుసు ఆదినారాయణ అనే ముఠా కార్మికుడితో పరిచయం ఏర్పడి   వివాహేతర సంబంధానికి తీసింది.  సత్య భర్త లేని సమయంలో ఆదినారాయణ ఆమె ఇంటికి వచ్చివెళుతూ ఉండేవాడు.

ఈవిషయాన్ని ఆదినారాయణ భార్య మల్లేశ్వరి పసి గట్టింది. ఆమె సత్య వద్దకు వచ్చి తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకోవద్దని, తన కాపురానికి అడ్డు రావద్దని కోరింది. ఆమె వినకపోవటంతో వారిద్దరిమధ్య పలుమార్లు గొడవ జరిగింది. వివాహేతర సంబంధం మానుకోమని మల్లేశ్వరి…ఒక్కోసారి సత్యను కొట్టేందుకుకూడా ప్రయత్నించేది.  అయినా సత్య  ప్రవర్తనలో మార్పురాలేదు.

ఈవిషయం సత్య   భర్తకు కూడా తెలిసిపోయింది. వారిద్దరూ  ఈవిషయానికి కూడా గొడవలు పడటం మొదలెట్టారు.  సత్య తీరు నచ్చక ఆమె భర్త 20 రోజుల క్రితం ఆమెతో  గొడవపడి ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు.  ఆ తర్వాత మూడు రోజులకు ఆదినారాయణ సత్యను ఇల్లు  ఖాళీ చేయించి వాళ్ల ఇంటికి సమీంపలోనే  మరో ఇంటిలోకి తల్లీ కూతుళ్లను మార్చాడు.
Also Read : Shilpa Chowdary : ఈ సారైనా నిజాలు చెపుతుందా శిల్పాచౌదరి ?
అప్పటినుంచి నిత్యం సత్య ఇంటికి వచ్చి వెళ్లటం మొదలెట్టాడు. ఈ విషయం తెలుసుకున్నమల్లేశ్వరి సత్య ఇంటికి వచ్చి గొడవపడి,  అక్రమ సంబంధం మానుకోకపోతే చంపేస్తానని హెచ్చరించి వెళ్లింది. అయినా ఆదినారాయణ, సత్యల ప్రవర్తనలో మార్పు  రాలేదు. దీంతో గురువారం డిసెంబర్ 9 వతేదీ రాత్రి సుమారు గం.8-30 సమయంలో మల్లేశ్వరి సత్య ఇంటికి వెళ్ళింది. ఇంట్లో   ఒంటరిగా ఉన్న సత్యతో మళ్ళీ గొడవపడింది. కోపం పట్టలేక తనతో తెచ్చుకున్న బ్లేడ్ తో    సత్య గొంతు కోసింది.   తీవ్రంగా రక్త స్రావం కావటంతో సత్య నేల కొరిగింది.  పక్కనే ఉన్నరోకలి బండ తీసుకుని తలపై చావమోదింది.  ఆమె చనిపోయిందనినిర్ధారించుకున్నాక ఇంటి తలుపులు దగ్గరకు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

గురువారం క్యాటరింగ్ పనికివెళ్లిన సత్య కూతురు రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి రక్తపు  మడుగులో నిర్జీవంగా పడి ఉండటం చూసి చుట్టుపక్కల వారిని పిలిచి చెప్పింది.  వారిచ్చిన సమాచారంతో   ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సత్య  కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు  నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఘటనా స్ధలంలో లభించిన వేలి ముద్రలు, రోకలి బండ స్వాధీనం చేసుకున్న పోలీసులు  సీసీ కెమెరాల పుటేజీని  పరిశీలిచారు. జాగిలాలు సత్య ఇంటి నుంచి మల్లేశ్వరి ఇంటి దాకా వెళ్లి ఆగిపోయాయి. సీసీటీవీ ఫుటేజిలో   గురువారం  రాత్రి మల్లేశ్వరి, సత్య ఇంటినుంచి బయటకు వెళుతున్నట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.  పోలీసు విచారణలో మల్లేశ్వరి నేరం ఒప్పుకోవటంతో ఆమెను రిమాండ్ కు తరలించారు.