Ministry of Health: పురుషులకంటే మహిళల జీవిత కాలం ఎక్కువ.. ఆ నివేదికలో ఆసక్తికర విషయాలు..
దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజల జీవితకాలం పెరుగుతోంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుండటంతో పాటు, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో మానవుల జీవితకాలం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రజల్లో...

Ministry of Health: దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజల జీవితకాలం పెరుగుతోంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుండటంతో పాటు, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో మానవుల జీవితకాలం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రజల్లో అనారోగ్యంబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెరుగుతోంది. పలు సంస్థలు, సామాజిక మాధ్యమాలు తదితర వాటిల్లో నిత్యం మెరుగైన ఆరోగ్యంకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు సూచనలు చేస్తుండటంతో ప్రజలుసైతం అప్రమత్తమవుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సర్వేను నిర్వహించి నివేదికను రూపొందించింది.
Women Health : మహిళలు ఉద్యోగంతోపాటు ఆరోగ్యం విషయంలోనూ!
ఈ నివేదిక ప్రకారం.. దేశంలో పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందని నివేదికలో తెలిపింది. అయితే దేశం మొత్తం మీద కేరళ రాష్ట్రంలోనే పురుషులు, స్త్రీల ఆయుష్షు అత్యధికంగా ఉంటుందని అంచనా వేసింది. కేరళలో మహిళల ఆయుర్దాయం 2031-35 మధ్య 80.2 సంవత్సరాలు, పురుషుల జీవితకాలం 74.5 సంవత్సరాలుగా ఉంటుందని జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తన నివేదికలో అంచనా వేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పురుషుల, స్త్రీల జీవితం కాలం తక్కువ అని నివేదికలో అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో 2031-35 మధ్య పురుషులు జీవితం కాలం 69.4 సంవత్సరాలు, మహిళల ఆయుర్దాయం 71.8 సంవత్సరాలు ఉంటుందని అంచనా. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2021 నుంచి 2025 వరకు పురుషుల జీవితం కాలం 69.06 కాగా, స్త్రీల జీవిత కాలం 73.6గా నివేదిక అంచనా వేసింది. ఇక 2026-30 మధ్య కాలంలో పురుషుల ఆయుర్దాయం 70.6 కాగా స్త్రీల ఆయుర్దాయం 74.6గా జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక పేర్కొంది.
Healthy Food : పిల్లల ఎదుగుదలలో పోషకాహారమే కీలకం!
2031-2035 మధ్య కాలంలో పురుషుల జీవితకాలం 71.4, స్త్రీల ఆయుర్ధాయం 75.6గా అంచనా. ఈ నివేదిక ప్రకారం ఏపీలో రానురాను మనుషుల ఆయుష్సు పెరుగుతుండగా, అందులో స్త్రీల జీవితకాలం పురుషుల కంటే నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక మరో విషయాన్ని పేర్కొంది. దేశంలో సంతానోత్పత్తి క్షీణించడంతో పాటు మనుష్సుల ఆయుష్సు పెరుగుతుండటంతో వృద్ధుల శాతం పెరుగుతుందని నివేదిక తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో మొత్తం జనాభాలో వృద్ధుల వాటా 8.4శాతం ఉండగా, 2031-35 మధ్య వృద్ధుల సంఖ్య రెండింతలు పెరిగి 14.9శాతానికి చేరుతుందని జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక అంచనా వేసింది.
- Covid-19 : దేశంలో కొత్తగా 2,226 కోవిడ్ కేసులు నమోదు
- ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
- Covid Variant: భారత్ లో నమోదైన రెండో BA.4 ఒమిక్రాన్ కేసు
- PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
- FDI inflow: దేశంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. ఒక్క ఏడాదిలో ఎంతంటే
1జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ
2Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్
3చైనా ఆర్మీ ఆడియో లీక్ కలకలం
4అసోంలో వరదల బీభత్సం
5పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం…!
6Anchor Shiva : బిగ్‌బాస్ నుంచి బయటకి రాగానే రచ్చ చేసిన యాంకర్ శివ.. క్లాస్ పీకిన పోలీసులు
7బీజింగ్‌లో మళ్లీ లాక్డౌన్…!
8Delhi Heavy Rains : ఢిల్లీలో భారీ వర్షం.. నేలకూలిన చెట్లు.. విమాన సర్వీసులు రద్దు!
9Covid cases in india: కరోనాతో చికిత్సపొందుతూ ఒకేరోజు 46 మంది మృతి..
10Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
-
Best 4G-5G Phones : రూ.20వేల లోపు బెస్ట్ 4G-5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి?
-
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రను మరోసారి టార్గెట్ చేసిన టెర్రరిస్టులు
-
MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారా ?
-
Xiaomi Mi Band 7 : షావోమీ MI బ్యాండ్ 7 లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Free Travel On RTC Bus : టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
-
10th Exams : నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్..ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-
Best Earphones : రూ.10వేల లోపు బెస్ట్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్లు ఇవే..