మహిళపై నిన్న కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్ నేడు ఆత్మహత్య 

  • Published By: chvmurthy ,Published On : February 23, 2020 / 07:53 AM IST
మహిళపై నిన్న కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్ నేడు ఆత్మహత్య 

ప్రేమించిన యువతి కుటుంబంపై నాటు తుపాకీతో రెండు రోజుల క్రితం కాల్పులు జరిపిన ఆర్మీ మాజీ జవాన్ బాలాజీ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కిందపడి సూసైడ్ చేసుకున్న బాలాజీ మృత దేహాన్ని బంధువులు గుర్తించారు. 

చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో యేమినేని బాలాజీ అనే వ్యక్తి ఆర్మీ జవాన్ గా పనిచేసేవాడు. ఒక పెళ్ళి వేడుకలో అదే గ్రామానికి చెందిన రమాదేవి అనే ఆమె కుమార్తెను చూసి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తన కోరిక తీర్చుకున్నాడు. మోజు తీరిన తర్వాత నువ్వు వద్దని ఆమెను దూరం పెట్టాడు. పెద్ద మనుషులు  ద్వారా పంచాయితీ చేసినప్పటికీ అతడు ఆమెను పెళ్ళి చేసుకోటానికి ససేమిరా అన్నాడు.

మోసపోయిన యువతి 2019 డిసెంబర్2వ తేదీన బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఈక్రమంలో కేసు నమోదు కావటంతో బాలాజీ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.  దీంతో రమాదేవి కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని తుద ముట్టించాలని గత 20 రోజుల్లో   3 సార్లు రాత్రిపూట రెక్కీ నిర్వహించాడు. 

పిబ్రవరి 22 వ తేదీ శనివారం తెల్లవారు ఝూమున తన మిత్రుడి సాయంతో నడింపల్లిలో నివాసం ఉంటున్న రమాదేవి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆసమయంలో ఎవరు వచ్చారా….  అనే సందేహంతో  అప్రమత్తమై తలుపు తీసిన రమాదేవి పై తనతో తెచ్చుకున్న నాటు తుపాకీతో 3 రౌండ్లు  కాల్పులు జరిపాడు. ప్రమాదాన్ని ముందే ఊహించిన రమాదేవి కాల్పులనుంచి త్రుటిలో తప్పించుకోవటంతో ఆమె చెవికి గాయం అయ్యింది.

ex army jawan 2

తుపాకి శబ్దం, రమాదేవి కేకలు విని స్ధానికులు బాలాజీని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్ధానికులు అంతా  పట్టుకోటానికి ప్రయత్నం చేయటంతో తనతో పాటు తెచ్చిన బ్యాగు, నాటు తుపాకీని అక్కడే వదిలేసి, తాను వచ్చిన ఆటోలో  బాలాజీ పరారయ్యాడు. గాయపడ్డ రమాదేవిని స్దానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ex army jawan 1

విషయం తెలుసుకున్న పోలీసులు రమాదేవి నుంచి ఫిర్యాదు స్వీకరించి, ఘటనా స్ధలంలో బాలాజీ వదిలి వెళ్లిన నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న బాలాజీ కోసం గాలింపు చేపట్టారు. ఎలాగైనా సరే పోలీసులు తనను అరెస్టు చేస్తారనిభయపడిన బాలాజీ ఆదివారం ఉదయం రైలు కింద పడి ప్రాణాలు విడిచాడు.