వాలంటైన్స్ డే గిఫ్టు పేరుతో డేటా చోరీ–సైబర్ కేటుగాళ్ల నయాదందా

వాలంటైన్స్ డే గిఫ్టు పేరుతో డేటా చోరీ–సైబర్ కేటుగాళ్ల నయాదందా

data theft under name of tata group,criminals offer valentines day gift : సందర్భాలను అవకాశంగా మలుచుకుని డేటా చోరీకి పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది వాలంటైన్స్ డే.  ప్రేమికుల రోజును ఆసరాగా చేసుకుని ప్రముఖ టాటా సంస్ధ పేరుతో డేటా చౌర్యానికి తెగబడ్డారు కేటుగాళ్లు.

కోన్ని ప్రశ్నలను వాట్సప్ లో   పంపించి వాటికి సమాధానాలు చెపితే   వాలంటైన్స్ డే రోజున  ఎంఐ 11టీ   ఫోన్ గెలుచుకోవచ్చని మెసేజ్ లు పంపిస్తున్నారు.  వాటి లింక్ నొక్కారో   మీ లాప్ టాప్, ఫోన్ లోని డేటా అంతా చోరీకి గురవుతుందని    సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.  మొదటగా టాటా కంపెనీ  లోగోతో ఉన్న లింక్ పంపిస్తారు. లింక్ నొక్కి సమాధానాలు చెపితే  ఫోన్ గెలుచుకోవచ్చని అందులో ఉంటుంది.  వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెపితే  మీరు ఫోన్ గెలుచుకున్నారని మెసేజ్ వస్తుంది.

అనంతరం  ఓ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని మళ్లీ సూచిస్తారు.  అది డౌన్ లోడ్ చేసుకున్నారంటే మీ ఫోన్,  ల్యాప్ టాప్ లోని డేటా అంతా చోరీ చేస్తారు కేటుగాళ్లు.   దీనితోపాటు మీ బ్యాంకు సమాచారం మొత్తం కేటుగాళ్లకు చేరుతుంది.  టాటా ప్రమోషన్ ను ఐదు వాట్సప్  గ్రూపుల్లోకి గానీ, లేదా 20 మంది స్నేహితులకు   కానీ పంపించాలనే సూచనతో  సైబర్ నేరగాళ్లు లింక్ పంపుతున్నారని…. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.