Father Sexual Abuse : కూతురుకి మద్యం తాగించి అత్యాచారం చేసిన తండ్రి

ప్రియురాలి మోజులో కన్న కూతురుకి మద్యం తాగించి  ఆమెపై అత్యాచారం చేశాడో కన్నతండ్రి. అదంతా ప్రియురాలితో వీడియో తీయించి ఎంజాయ్ చేశాడు.

Father Sexual Abuse : కూతురుకి మద్యం తాగించి అత్యాచారం చేసిన తండ్రి

Markapuram Father

Father Sexual Abuse : ప్రియురాలి మోజులో కన్న కూతురుకి మద్యం తాగించి  ఆమెపై అత్యాచారం చేశాడో కన్నతండ్రి. అదంతా ప్రియురాలితో వీడియో తీయించి ఎంజాయ్ చేశాడు. బాధితురాలు కన్నతల్లికి చెప్పటంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీచక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వ్యక్తి   వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు.  ఇతను బెస్తవారి పేటకు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత నెల 25న కుమార్తెను తాను పని చేస్తున్న ఊరుకు తీసుకు వెళ్లాడు.
Also Read : Chapati : ప్రాణం తీసిన చపాతి
అక్కడ తన ప్రియురాలితో కలిసి మద్యం తాగుతూ… కూతురుతో కూడా బలవంతంగా మద్యం తాగించాడు. ఆ పై కుమార్తెపై లైంగిక దాడి చేస్తూ ప్రియురాలితో సెల్ ఫోన్ లో అదంతా వీడియో తీయించాడు. బాలిక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తల్లికి జరిగిన విషయం మొత్తం  చెప్పింది. తల్లితో కలిసి బాలిక మార్కాపురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు… నిందితుడిని అక్టోబర్ 2 సాయంత్రం అరెస్ట్ చేశారు.