Students Missing : చెప్పకుండా సినిమాకు వెళ్లారు-టీచర్ మందలింపు-నలుగురు విద్యార్ధులు ఆదృశ్యం

గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్ధులు ఆదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. చెప్పకుండా సినిమాకు వెళ్లినందుకు తల్లిదండ్రులు,టీచర్స్ తిడతారు,కొడతారనే భయంతో పారిపోయారు. దీంతో ఈ విషయ

Students Missing : చెప్పకుండా సినిమాకు వెళ్లారు-టీచర్ మందలింపు-నలుగురు విద్యార్ధులు ఆదృశ్యం

New Project (2)

Students Missing :  గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్ధులు ఆదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. చెప్పకుండా సినిమాకు వెళ్లినందుకు తల్లిదండ్రులు,టీచర్స్ తిడతారు,కొడతారనే భయంతో పారిపోయారు. దీంతో ఈ విషయం పట్టణంలో కలకలం సృష్టించింది.

మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి చెందిన నలుగురు విద్యార్థులు మానుకొండ సంతోష్, ఈడే వెంకటేష్ గౌడ్, కలవకొండ వెంకటేష్,కలువకొండ ప్రభుదేవా విద్యార్థులు స్నేహంగా ఉంటారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు స్థానికంగా టిప్పర్ల బజార్ లోనే మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదో తరగతి, నాలుగో తరగతి చదువుతున్నారు. మరొక విద్యార్థి వెంకటేష్ గౌడ్ యర్రబాలెంలో ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు.

వీరంతా స్థానికంగానే కలిసి ఉంటూ స్నేహంగా ఉంటున్నారు. సోమవారం ఉదయం రోజూలాగానే స్కూలుకు వెళ్లారు. స్కూలులో పుస్తకాల బ్యాగులు పెట్టి సినిమాకు వెళ్ళారు. సినిమా చూసి తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు బ్యాగులు తీసుకెళ్ళటం కోసం స్కూలుకు వచ్చారు. ఆసమయంలో స్కూల్ మాస్టారు వీరిని గమనించి పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నించారు. మీ పెద్ద వాళ్లను తీసుకు వస్తేనే పుస్తకాలు ఇస్తాను అని చెప్పటంతో పిల్లలు భయపడ్డారు. చెప్పకుండా సినిమాకు వెళ్లినందుకు తల్లిదండ్రులు కొడతారనే భయంతో… ఇంటికి వెళ్లకుండా… తిరిగి పాఠశాలకూ వెళ్ళక ఎక్కడికో వెళ్లారు. వెంకటేష్ గౌడ్ యర్రబాలెం స్కూలునుంచి వచ్చాక నలుగురు కలిసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Also Read : Nightclubs: కోవిడ్ వచ్చేసింది.. క్లబ్బులు మూసేయండి

స్కూలు విడిచిపెట్టే సమయం దాటి పోయినా తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో వారు తల్లిదండ్రులు స్కూల్లో విచారించగా జరిగిన సంగతి చెప్పారు. దీంతో నలుగురు విద్యార్ధుల తల్లి తండ్రులు,పాఠశాల సిబ్బంది విద్యార్థుల కోసం ఊరంతా వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో తమ పిల్లలు కనబడటం లేదని పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఉదయం ఫిర్యాదు చేశారు. యన మాట్లాడుతూ ఎవరైనా నలుగురు విద్యార్థులు స్కై బ్లూ రంగు చొక్కా, బ్లూ కలర్ ప్యాంట్ గల స్కూల్ యూనిఫామ్ ధరించిన వారు కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కోరారు. పోలీసులు కూడా వీరి ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారని వివరించారు.