Hyderabad : హైదరాబాద్ లో విషాదం.. ఇద్దరు చిన్నారులు, భార్యకు విషమిచ్చి భర్త సూసైడ్

పిల్లల అనారోగ్యంతో దంపతులిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. నిన్న శనివారం పిల్లలు, భార్యకు సతీశ్ సైనైడ్ ఇచ్చాడని ముగ్గురూ చనిపోయారని ధృవీకరించుకున్నాక తానూ కూడా తీసున్నాడని పోలీసులు అన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad : హైదరాబాద్ లో విషాదం.. ఇద్దరు చిన్నారులు, భార్యకు విషమిచ్చి భర్త సూసైడ్

Hyderabad

Hyderabad : ఆ దంపతులకు పిల్లలే ప్రాణం..వాళ్లే ప్రపంచం..అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడతారని వారు తట్టుకోలేకపోయారు. వైద్యం అందించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వేదనకు గురయ్యారు. బిడ్డలకు విషం ఇచ్చి తాము తీసుకున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలోని కందిగూడలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ కు చెందిన గాదె సతీశ్ కు, సిద్దిపేట జిల్లా దౌల్తాబద్ మండలానికి చెందిన వేదతో 2012లో వివాహమైంది.

వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేవు. నగరంలో సాఫ్ల్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న సతీశ్ కుటంబంలో కందిగూడలో రెండేళ్లుగా నివాసముంటున్నాడు. నిహాల్ పుట్టకతోనే ఆటిజమ్ తో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం నిశికేక్ కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. నిశికేక్ కు చెవుల నుంచి తరచూ చీము రావడంతోపాటు వినికిడి లోపం ఏర్పడింది. అప్పటి నుంచి దంపతులిద్దరూ పిల్లల ఆరోగ్యం గురించి బాధపడేవారు.

Krishna District : అప్పుల బాధతో చేనేత కుటుంబం ఆత్మహత్య

పిల్లల అనారోగ్యంతో దంపతులిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. శనివారం పిల్లలు, భార్యకు సతీశ్ సైనైడ్ ఇచ్చాడని, ముగ్గురూ చనిపోయారని ధృవీకరించుకున్నాక తాను కూడా సైనైడ్ తీసున్నాడని పోలీసులు అన్నారు. మధ్యాహ్నం తర్వాత సతీశ్, వేదలకు తెలిపిన వ్యక్తులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. అనుమానంతో ఇంటికి వచ్చి చూడగా ఇద్దరు పిల్లలు, వేద బెడ్ రూమ్ లో మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు.  సతీశ్ పక్క గదిలో కుప్పకూలి పోయి కనిపించాడు.

ఆత్మహత్య చేసుకున్న గదిలో లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తమను కాపాడాలని ప్రయత్నించొద్దు.. ప్రశాంతంగా చనిపోనివ్వండి అంటూ సూసైడ్ లేఖలో రాశారు. దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారని, పిల్లల అనారోగ్యంపైనే మనస్థాపానికి గురయ్యేవారని వేద తండ్రి శ్రీశైలం అన్నారు. వారికి సయనైడ్ ఎలా లభించింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.