చిత్తూరు జిల్లాలో 11 కిలోల బంగారం, 60 వజ్రాలు సీజ్

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో భారీగా బంగారం, వజ్రాలు పట్టుబడటం సంచలనం కలిగించింది.

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 09:58 AM IST
చిత్తూరు జిల్లాలో 11 కిలోల బంగారం, 60 వజ్రాలు సీజ్

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో భారీగా బంగారం, వజ్రాలు పట్టుబడటం సంచలనం కలిగించింది.

చిత్తూరు : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో భారీగా బంగారం, వజ్రాలు పట్టుబడటం సంచలనం కలిగించింది. జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజక పరిధిలోని పల్లిపట్టు చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 11 కిలోల బంగారం, 60 వజ్రాలు పట్టుబడింది.
Read Also : సమ్మర్ ఎఫెక్ట్ : ఏపీలో సాయంత్రం 6 వరకు పోలింగ్

తిరుపతి నుంచి వస్తున్న ఓ వాహనంలో బంగారం, వజ్రాలను తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు…వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన సరైన బిల్లులు చూపకపోవడంతో సీజ్ చేశారు. పట్టుబడిన సొత్తు ప్రముఖ బంగారం విక్రయ సంస్థ చందనా బ్రదర్స్ కు చెందినదిగా గుర్తించారు. 

11 కిలోల బంగారం, 60 వజ్రాలు స్పైస్ జెట్ విమానంలో విజయవాడ నుంచి చెన్నై తరలించారు. కంటెయినర్ లో చిన్న బాక్స్ లో వాటి మొత్తాన్ని చెన్నై నుంచి తిరుపతి తరలిస్తున్నారు. బంగారం, విలువైన వజ్రాలు తిరుపతిలోని వివి మహల్ రోడ్డులో ఉన్న ప్రముఖ విక్రయ సంస్థ చందనా బ్రదర్స్ కు చెందినదిగా తెలుస్తోంది.

సీజ్ చేసిన మొత్తం బంగారం, వజ్రాలను చిత్తూరు జిల్లాలోని ఎన్నికల ప్రధాన అధికారి సెక్రటేరియట్ కు తరలించారు. బిల్లు లేనందు వల్ల పట్టుకున్నామని…పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు చెప్పారు. 
Read Also : ఒక్కటి సరిపోదు : అన్నయ్యలాగే పవన్ కళ్యాణ్ కూడా!