Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో సంచలన విషయాలు

తెలుగు అకాడమీ నిధులు గోల్‌మాల్‌పై తవ్వుతున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంతోశ్‌ నగర్‌ యూనియన్ బ్యాంకు బ్రాంచ్‌ నుంచి FDలు కొంత మాయమైనట్టు గుర్తించారు.

Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో సంచలన విషయాలు

Telugu Academy

Telugu Academy Funding Manipulations : తెలుగు అకాడమీ నిధులు గోల్‌మాల్‌పై తవ్వుతున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంతోశ్‌ నగర్‌ యూనియన్ బ్యాంకు బ్రాంచ్‌ నుంచి FDలు కొంత మాయమైనట్టు గుర్తించారు. సంతోశ్‌ నగర్ బ్రాంచ్‌ నుంచి 8 కోట్ల రూపాయలు మాయం అయ్యాయి. కార్ఖానా బ్రాంచ్‌ నుంచి 43 కోట్ల రూపాయలు అకాడమీ ఖాతా నుంచి డ్రా అయినట్టు తేల్చారు. అయితే 51 కోట్ల కంటే ఎక్కువ నిధులు గోల్‌మాల్ అయినట్టు అనుమానిస్తున్నారు.

మరోవైపు సీసీఎస్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. అయితే నిన్న మరో ఫిర్యాదు చేశారు అకాడమీ అధికారులు. ఈ నెల 24న ఇచ్చిన ఫిర్యాదుతో పాటు మరో కంప్లైంట్ నమోదైంది. దీంతో అకాడమీలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది. ఇప్పటికే బ్యాంకు సిబ్బందితో పాటు అకాడమీ ఉద్యోగులను సీసీఎస్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేశారు.

Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌తో సోము వీర్రాజు భేటీ, బద్వేల్‌ ఉప ఎన్నికపై చర్చ

ఉద్దేశపూర్వకంగానే నిధులు గోల్‌మాల్‌ చేసినట్లు గుర్తించారు. ఫోర్జరీ సంతకాలతో బదిలీ చేశారని అనుమానిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమా? తెలిసే బదిలీ చేశారా? అనేకోణంలో దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ఇదే కేసులో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. అక్టోబరు 2లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఏపీకి పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో 43 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లున్నాయని తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు.

Galla Jayadev : ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంపై భూ ఆక్రమణ కేసు

ఈ నెల 21న డిపాజిట్‌ పత్రాలు బ్యాంకుకు చేరినా అక్కడి నుంచి సమాచారం రాలేదు. మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్‌ నేరుగా బ్యాంకుకు వెళ్లి అడగగా… ఆగస్టులోనే 43 కోట్ల రూపాయలు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…ఈ విషయం వెలుగులోకి వచ్చింది.