Wife Extra Marital Affair : భార్య వివాహేతర సంబంధం…కల్పించుకోవద్దని వార్నింగ్…..

తాళి కట్టిన భార్య  ఉద్యోగం పేరుతో బయటకు వెళ్ళి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తెలుసుకున్న భర్త  ప్రవర్తన మార్చుకోమన్నాడు.

Wife Extra Marital Affair : భార్య వివాహేతర సంబంధం…కల్పించుకోవద్దని  వార్నింగ్…..

Extra Marital Affair

Wife Extra Marital Affair : తాళి కట్టిన భార్య  ఉద్యోగం పేరుతో బయటకు వెళ్ళి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తెలుసుకున్న భర్త  ప్రవర్తన మార్చుకోమన్నాడు.  తన ప్రవర్తన మార్చుకోని భార్య,  భర్తను హెచ్చరించింది. మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

లక్నో లోని   గోమతి నగర్ లో   కిరాణా షాపు  నిర్వహించే నిఖిల్ 2012లో వివాహం చేసుకున్నాడు.  వారికి ఒక కుమార్తె పుట్టింది. నిఖిల్ షాపు కు   వెళ్ళాక ఇంట్లో ఉంటున్న భార్యకు  ఏమీ తోచక  ఒక ఎన్జీవో లో  ఉద్యోగంలో చేరింది. అక్కడ ఆమెకు ఆ సంస్ధ యజమానితో   సన్నిహిత సంబంధం ఏర్పడింది.  అది కాస్తా వివాహేతర  సంబంధానికి  దారి తీసింది. దీంతో ఆమె తన కుటుంబం గురించి పట్టించుకోవటం మానేసింది.

Also Read : Jammu Fast Track Court : మహిళపై అత్యాచారం చేసిన కేసులో సబ్ జడ్జిని దోషిగా తేల్చిన కోర్ట్

భార్య ప్రవర్తన పై  అనుమానం వచ్చిన  నిఖిల్ భార్య పై నిఘా పెట్టాడు. ఆమె వివాహేతర సంబంధాన్ని తెలుసుకున్నాడు. భార్యను పధ్ధతి మార్చుకోమని హెచ్చరించాడు. అయినప్పటికీ  ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈవిషయమై తరచూ గొడవలు జరగటం మొదలయ్యింది. ఈ క్రమంలో మంగళవారం జరిగిన ఘర్షణలో….తన అక్రమ సంబంధానికి అడ్డురావద్జని ఆమె భర్తకు తెగేసి చెప్పింది. అనవసరంగా తన వివాహేతర సంబంధంలో అడ్డుపడితే అంతుచూస్తానని కూడా బెదిరించింది.

తాళి కట్టిన భార్య ఇంతలా చెప్పేసరికి తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్ధలం నుంచి 3 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.  నిఖిల్ తండ్రి కిషన్ కుమార్ ఫిర్యాదు మేరకు నిఖిల్ భార్య, ఆమె యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.