Giza pyramid : 4,500 ఏళ్ల నాటి గిజా పిరమిడ్‌లో 30 అడుగుల సొరంగం గుర్తింపు..ఇక సమాధుల సీక్రెట్ వీడేనా?

ఈజిప్టులో గ్రేట్‌ గిజా పిరమిడ్‌ ఉత్తరభాగంలో భారీ సొరంగాన్ని కనుగొన్నారు. ఈ సొంరంగం సుమారు 30 అడుగుల పొడవున..ఆరు అడుగుల వెడల్పుగా ఉంది.

Giza pyramid : 4,500 ఏళ్ల నాటి గిజా పిరమిడ్‌లో 30 అడుగుల సొరంగం గుర్తింపు..ఇక సమాధుల సీక్రెట్ వీడేనా?

Hidden Corridor Inside the Great Pyramid of Giza in Egypt

Giza pyramid : పిరమిడ్‌ అంటే ఠక్కున గుర్తు కొచ్చే దేశం ఈజిప్ట్. ప్రపంచంలో అత్యంత గొప్ప, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమైనవి..ప్రపంచవ్యాప్తంగా పేరొందినవి. ఇవి ప్రపంచ వింతల్లో ఒకటి. ప్రాచీన, మధ్య యుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచిపోయిన ఈ పిరమిడ్ల గురించి ఎన్నో రహస్యాలు దాగున్నాయి. క్రీ.పూ. 2886-2160 నాటి ఈ పిరమిడ్ల రహస్యాలను ఛేదించాలని పురవాస్తు పరిశోధకులు వారి పరిశోధనలను కొనసాగిస్తునే ఉన్నారు.

ఈజిప్టులోని పిరమిడ్లతో గ్రేట్‌ గిజా పిరమిడ్‌ ఓ అద్భుతం. అంతులేని మిస్టరీ. ఈ మిస్టరీలను ఛేధించటానికి నిరంతరం పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలోనే పరిశోధకులు ఈజిప్టులో గ్రేట్‌ గిజా పిరమిడ్‌ ఉత్తరభాగంలో భారీ సొరంగాన్ని కనుగొన్నారు. ఈ సొంరంగం సుమారు 30 అడుగుల పొడవున..ఆరు అడుగుల వెడల్పుగా ఉంది. పిరిమిడ్‌లోని గుర్తించని భాగాలను కనిపెట్టడమే లక్ష్యంగా చేపట్టిన అంతర్జాతీయ ప్రాజెక్టు ‘స్కాన్‌ పిరమిడ్స్‌ ప్రాజెక్టు’లో భాగంగా తాజా సొరంగాన్ని గుర్తించామని ఈజిప్టు పర్యాటక శాఖ మంత్రి అహ్మద్‌ గురువారం (మార్చి3,2023( ప్రకటించారు.

ఈజిప్టులో నైలునదీ లోయకు 51 వ మైలు వద్ద, నైలు నదికి పశ్చిమంలో, ప్రాచీన మెంఫిసిన్ వద్ద సుమారు 700 కి పైగా పిరమిడ్ లు కనిపిస్తాయి. ఈ పిరమిడ్లలో ఈజిప్టు రాజులను సమాధి చేశారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు 1000 సంవత్సరాలు పట్టి ఉండవచ్చునని చరిత్ర కారుల అంచనా.

వీటిలో ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా లేదా ఖుఫు పిరమిడ్ అత్యంత ప్రాచీనమైనది. ఇది అతి పెద్ద పిరమిడ్లలో మూడవది. యిది “ఛెఫ్‌రాన్” పిరమిడ్ కు నైఋతి దిశలో ఉంది. దీనిని పిరమిడ్ మైసిరిసన్ అని గూడా పిలుస్తారు. ఇది 354 అడుగులు (108 మీటర్లు) చదరముల ఎత్తు 230 అడుగులు లేక 70 మీటర్లు. ఈ పిరమిడ్ ముఖతలాలు పింక్ రంగు గ్రానైట్, సున్నపు రాయి మిశ్రమఫలకాలతో నిర్మాణమైనవి. ప్రాచీన ప్రపంచ ఏడు వింతల్లో ఈ పిరమిడ్ ఒకటి.

నాలుగవ ఈజిప్ట్ ఫారో అయిన ఖుఫు మరణానంతరం దీనిని 20 ఏళ్ళ పాటు నిర్మించి క్రీ.పూ. 2560లో పూర్తి చేసారని అంటారు. నిర్మాణం పూర్తి అయిన నాటికి దీని ఎత్తు 146.6 మీటర్లు. ఈ పిరమిడ్ ఒక్కో భుజం 225 మీటర్లకు పైగా పొడవు కలిగి ఉంది. ఈ పిరమిడ్ బరువు 59 లక్షల టన్నులు అని అంచనా. ఈ పిరమిడ్ నిర్మాణం ఎంత కచ్చితంగా జరిగిందంటే 225 మీటర్ల పొడవు ఉన్న నాలుగు భుజాల మధ్య కేవలం 58 మిల్లీ మీటర్ల తేడా మాత్రమే ఉన్నది. ఈ పిరమిడ్ నిర్మాణానికి దాదాపు రెండు లక్షల మంది పనిచేసారట.

గీజాలు ఈ పిరమిడ్స్ తో పాటు, “స్ఫినిక్స్” చాలా ప్రసిద్ధమైనవి. ఇవి రాతి శిల్పాలు. మనుష్యుని తల, మిగిలిన శరీర భాగంలో సింహం ఆకృతిలో ఉంటాయి. ఇది “ఛిఫ్‌రాన్” ఆకారంగా చెప్పబడుతోంది. ఈ స్ఫినిక్స్ ను సూర్య దేవునిగా భావించి, పూజచేయడం, ఆరాధించడం ఈజిప్షియన్ల ఆచారం.