Pakistan: ఇమ్రాన్ విదేశీ కుట్ర ఆరోపణలు.. పాక్ ఏం చెప్పింది

తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విదేశీ శక్తులు కుట్ర చేశాయని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది.

Pakistan: ఇమ్రాన్ విదేశీ కుట్ర ఆరోపణలు.. పాక్ ఏం చెప్పింది

Imran Khan

Pakistan: తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విదేశీ శక్తులు కుట్ర చేశాయని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కూల్చే విషయంలో ఎలాంటి విదేశీ శక్తుల ప్రమేయం లేదని పాక్ క్యాబినెట్‌కు చెందిన జాతీయ భద్రతా సంఘం తెలిపింది. శుక్రవారం సమావేశమైన ఈ సంఘం ఇమ్రాన్ ఆరోపణలను తోసిపుచ్చింది. ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

Pakistan pm letar : మోదీ లేఖకు స్పందించిన పాక్ ప్రధాని.. కాశ్మీర్ అంశంపై ఏమన్నారంటే?

తన పార్టీ ఆధ్వర్యంలోని పాక్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికాతోపాటు, పలు దేశాలు కుట్ర చేశాయని, విశ్వాస పరీక్ష సందర్భంగా ఇమ్రాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయింది. మరోవైపు ఇమ్రాన్‌కు భద్రత పెంచాలని కూడా ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ఇమ్రాన్ పాకిస్తాన్‌లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మరింత భద్రత పెంచాలని అధికారులకు సూచించింది.